»   » అక్కడ తప్పించుకొని ఉప్పల్ లో బుక్కయ్యారు.... ధోనీ ప్రేమాయణం కొత్త మలుపు

అక్కడ తప్పించుకొని ఉప్పల్ లో బుక్కయ్యారు.... ధోనీ ప్రేమాయణం కొత్త మలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనదగ్గర తక్కువ గానీ బాలీవుడ్ స్టార్లు అపుడ‌పుడు కొన్ని చిలిపి చేష్టలు చేస్తుంటారు.అక్కడి మీడ్యా కాస్త చూపు గట్టిగా వేస్తే వారి గురించిన నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయి.అయితే గ‌త కొంత‌కాలంగా బిటౌన్ సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఎవ‌రూ స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. స్టార్ల మధ్య ఉండే ఎఫైర్లు సర్వసాధారణం అయిపోవటం తో జనాలకి ఆసక్తి సన్నగిల్లింది... అయితే తాజాగా ఒక జంట మళ్ళీ అందరి దృష్టినీ ఆకర్శిస్తోంది... ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరూ అంటే... తెర మీద ధోనీ సుశాంత్ రాజ్ పూత్, మన మహేష్ తో నేనొక్కడినే' లో కనిపించిన కృతీసనన్...

రాబ్తా

రాబ్తా

కృతి సనన్ తో కలిసి "రాబ్తా" మూవీ చేశాడు సుశాంత్. వచ్చేనెలలో ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈలోపు ప్రచారంలో భాగంగా సుశాంత్-కృతి తెగ రాసుకుంటూ తిరిగేస్తున్నారు. ఇంతకుముందు అంకిత లోఖండే అనే అమ్మాయితో చాన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు సుశాంత్.

కృతి సనన్‌తో ప్రేమాయణం

కృతి సనన్‌తో ప్రేమాయణం

ఐతే గత ఏడాది ఆమె నుంచి విడిపోయి.. ‘ నేనొక్కడినే' భామ కృతి సనన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టినట్లుగా గుసగుసలు వినిపించాయి.సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని.. వీరిద్దరూ కలిసి నటించిన 'రాబ్తా' షూటింగ్ సందర్భంగా కలిగిన సాన్నిహిత్యం మరింత ఎక్కువైందని సినీ పండితులు అంటున్నారు.

అంకితా లోఖండే

అంకితా లోఖండే

కృతి సనన్ కోసమే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ప్రేయసి అంకితా లోఖండేకు గుడ్ బై చెప్పేశాడని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరూ కలిసి బోలెడన్ని సార్లు కెమెరాలకు చిక్కారు. ఈ మధ్య సుశాంత్ కొత్తగా కొన్న లగ్జరీ కారులో కృతిని కూర్చోబెట్టుకుని చక్కర్లు కొట్టడం పెద్ద చర్చకే దారి తీసింది.

వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే

వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ సైతం వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే అంటూ ఓ కథనం కూడా ప్రచురించింది. అయితే సుశాంత్ కు కాస్త షార్ట్ టెంపర్ ఉంది. ఎవరితోనైనా ఇట్టే గొడవలు పెట్టుకుంటాడు. కృతితో కూడా ఈ మధ్య అలాంటిదే చిన్న గొడవ జరిగింది. అదే విషయాన్ని పత్రికలు రాసేసాయ్...

కృతి సనన్ నాదే

కృతి సనన్ నాదే

అయితే సుశాంత్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇటువంటివి ఎన్ని రాసినా కృతి సనన్ నాదే అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హీరోయిన్ నాదే అనేశాడంటే.. లవ్ స్టోరీ గురించి దాదాపుగా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసినట్లే. నిన్న హైద్రాబాద్ లో జరిగిన ముంబై-పూనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేశారు. అక్కడ కాస్త ప్రైవసీ తగ్గిందనుకుని హైదరాబాద్ వచ్చి నా ఇక్కడా మీడియా కెమెరాలకు బుక్ అయిపోయారీ ఇద్దరూ...

English summary
Kriti Sanon, the Bollywood actor, was spotted in Uppal Stadium with her upcoming film "Raabta" co star Sushant Singh Rajput
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu