»   » మహేష్ బాబు హీరోయిన్.... రూ. 2 వేల నోట్ల డ్రెస్ (ఫోటో)

మహేష్ బాబు హీరోయిన్.... రూ. 2 వేల నోట్ల డ్రెస్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై మహేష్ బాబు హీరోగా వచ్చిన '1-నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రితి సానన్ గుర్తుందా? ఆ సినిమా ప్లాప్ కావడంతో క్రితి సానన్ తెలుగు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తోంది.

తాజాగా క్రితి సానన్.... తన డ్రెస్ ద్వారా హాట్ టాపిక్ అయింది. రూ. 2000 నోట్లతో డిజైన్‌ చేసిన గౌను ధరించి వార్తల్లోకి ఎక్కింది.... అసలే జనం చేతిలో డబ్బుల్లేక అల్లాడుతుంటే అమ్మడు ఇంత పని చేసిందా? అని ఆగ్రహించొద్దు సుమీ. ఎందుకంటే నిజంగా రూ. 2000 నోట్లతో తయారు చేసిన డ్రెస్ కాదు...అలా డిజైన్ చేసారంతే.

kriti sanon

దేశ వ్యాప్తంగా డీమోనిటైజేషన్ వల్ల ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలిసిందే. పాత నోట్లు రద్దు కావడంతో ప్రజలంతా చేతిలో డబ్బులు లేక ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రితి సానన్ రూ. 2000 నోట్లను పోలిన ప్రింటుతో తయారు చేసిన డ్రెస్ ధరించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయంది.... పబ్లిసిటీ కోసమే ఈ రకమైన డ్రెస్ ధరించినట్లు స్పష్టమవుతోంది. మరి ఈ డ్రెస్ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

English summary
Kriti Sanon was spotted wearing a dress that had prints of the newly launched Rs. 2000 all over it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu