»   »  హత్యకు ముందు లైంగికదాడి.. సినీ నటి కేసులో ఇద్దరి అరెస్ట్!

హత్యకు ముందు లైంగికదాడి.. సినీ నటి కేసులో ఇద్దరి అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి కృతికా చౌదరీ వ్యవహారంలో ముంబై పోలీసులు ముందుడుగు వేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన కృతిక కేసులో కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తున్నది. కంగన రౌనత్ నటించిన బాలీవుడ్ చిత్రం రజ్జోలో ఓ పాత్రను పోషించిన కృతికా మృతదేహాన్ని జూన్ 12వ తేదీన పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. ముంబైలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో కుళ్లిన శవాన్ని గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కృతిక నాలుగురోజుల ముందే మరణించిందని పోలీసుల ధృవీకరించారు.

కృతికా చౌదరీ కేసులో పోలీసులు మాట్లాడుతూ.. మరణానికి ముందు కృతికాపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చు. ఆ తర్వాతే ఆమె దారుణ హత్యకు గురై ఉంటుంది అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను, కృతిక స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్ని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కృతిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

Kritika Chaudhary murder: Police suspect sexual assault, detain watchman and friend

కృతిక మృతితో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. జూన్ 8వ తేదీన కూడా కృతికతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాం. జూన్ 12వ తేదీన కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ ఫోన్ కలువలేదు. పోలీసులు కృతిక మరణించినట్టు తెలుపడంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. బుధవారం అంధేరి శ్మశనావాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించాం అని కృతిక సోదరుడు తెలిపారు.

ఇటీవల సొంత పట్టణం హరిద్వార్‌కు వచ్చిన సమయంలోనే తమతో మాట్లాడినట్టు కృతిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి ఘోర జరుగుతందని ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

కృతికకు సంబంధించిన శవపరీక్ష నివేదిక ఇంకా అందలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాథమిక వివారాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించాం. త్వరలోనే వాటిని మీడియాకు వెల్లడిస్తాం అని పోలీసులు పేర్కొన్నారు.

English summary
The industry was in for a rude shock when a struggling actress' decomposed body was found in her Andheri flat on June 12. Kritika Chaudhary, the deceased was from Haridwar and even landed a small role in Kangana Ranaut starrer Rajjo. The cops broke open her house after her neighbours complained of a foul smell emanating from her apartment on June 12. The police found a dead, decomposed body of Kritika lying. There was a head injury too which happened to be caused with a steel item.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu