Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చిరంజీవికి రాజకీయాలు కరెక్ట్ కాదు, మీ తమ్ముడు చూసుకుంటాడు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
యాక్షన్ అండ్ మాస్ మసాలాతో కలగలిపి సినిమాలను తెరకెక్కించి ప్రత్యేకమైన గర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. మాస్ మహారాజా రవితేజ పవర్ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన రవీంద్ర తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ తెరకెక్కించి సాలిడ్ హిట్ కొట్టారు. తర్వాత వెంకటేశ్-నాగ చైతన్యతో మల్టీ స్టారర్ చిత్రంగా వెంకీ మామతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యగా చూపించనున్నాడు బాబీ. అయితే తాజాగా రాజకీయాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ పాత్రలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర.

సినిమాపై భారీ అంచనాలు..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ వయులోను యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఆచార్యతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న వెంటనే గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టారు. ఇప్పుడు త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జనవరి 13న ప్రేక్షకుల ముందుకు..
వాల్తేరు వీరయ్యగా మరోసారి మాస్ అవతారంతో మెస్మరైజ్ చేసేందుకు మెగాస్టార్ చిరు రెడీగా ఉన్నా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు.

అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
చిరంజీవి అభిమానిగా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ బాబీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న అంటే ఆదివారం విశాఖలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానం వేదికగా మారింది.

ల్యాండ్ వాల్యూ..
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కెఎస్ రవీంద్ర మాట్లాడుతూ.. "ఇప్పుడు నేను చెబితే సినిమాటిక్ గా అనుకుంటారు. చిరంజీవి సినిమా చూసినప్పుడు నాన్న నేను ఆయనతో సినిమా చేస్తాను. మీరు నేను ముందు కూర్చుండి చూస్తాం అన్నాను. ఇప్పుడు నేను అన్నయ్య (చిరంజీవి) సినిమాను డైరెక్ట్ చేశాను. ఆయన (నాన్న) పై నుండి చూస్తున్నారు. నాన్న నువ్ నాటిన ల్యాండ్ వాల్యూ 39 ఏళ్లు వచ్చేసరికి మెగాస్టార్ ను డైరెక్ట్ చేశాను. ఇంతకన్నా ఇంకేం కావాలి. గూగుల్ లో నాకంటూ కొన్నిపేజీలు వచ్చాయి" అని అన్నారు.

వాళ్లకు తల్లిదండ్రులు ఉంటారు..
"నేను మిమ్మల్ని దగ్గరి నుంచి చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకునే వాన్ని అన్నయ్య. ఎందుకు మెగాస్టార్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ కి కోపం రాదు. ఎవరెవరో మాట అంటే ఎందుకు తిరిగి అనరు. ఓ రోజు ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పారు. అవతలి వాడు అన్నాడు కదా అని మనం అనేస్తే.. వాళ్లకు తల్లిదండ్రులు ఉంటారు.. భార్యాపిల్లలు ఉంటారు, చెల్లెల్లు ఉంటారు, వాళ్లు బాధపడుతుంటారు బాబీ అన్నారు. ఇలా ఎలా వచ్చిందో మీకు ఈ గుణం" అని బాబీ పేర్కొన్నారు.

మీకు రాజకీయాలు కరెక్ట్ కాదు..
"అన్నయ్య
మీరు
రాజకీయాల్లోకి
వెళ్లాక
నేను
మీతో
మళ్లీ
చేయలేనేమో
అని
ఎక్కడో
ఫీల్
ఉండేది.
కానీ
మీకు
రాజకీయాల్
ఒక్క
శాతం
కూడా
కరెక్ట్
కాదన్నయ్య.
మీకు
దేవుడు
ఒక
తమ్ముడిని
ఇచ్చాడు.
అతను
చూసుకుంటాడు.
అతను
సమాధానం
చెబుతాడు.
అతను
గట్టిగా
నిలబడతాడు.
మీలో
నుంచి
వచ్చిన
ఆవేశం,
మంచితనం
కలిపేస్తే
పవర్
స్టార్.
అతను
మాటకు
మాట,
కత్తికి
కత్తి,
పదునుకు
పదును
పవర్
స్టార్.
ఆయనతో
ఇంతకుముందు
పనిచేశాను.
ఇప్పుడు
మీతో
పనిచేశాను.
సేమ్
మంచితనం.
సేమ్
జనాల
మీద
ఉన్న
ప్రేమ"
అని
చెప్పుకొచ్చారు
డైరెక్టర్
కెఎస్
రవీంద్ర.