For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇష్టం లేకున్నా ఆయన కోసమే చేసా.... (అనసూయ ఇంటర్వ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పి.వి.పి సినిమాస్ వారు రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వారు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం'. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ భరద్వాజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు.

  Also Read: సెక్సియెస్ట్ రీమార్క్స్: యాంకర్ అనసూయకు కోపం వచ్చింది!

  అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

  Also Read: నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్ (ఫోటోస్)

  ‘క్షణం' ఈ నెల 26న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా అనసూయ మీడియాతో చిట్ చాట్ చేసారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ...క్షణం సినిమా నా తొలి సినిమా కావాల్సింది. అయితే చిన్న రోల్ చేసిన సోగ్గాడేచిన్ని నాయనా ముందుగా విడుదలై, మంచి పేరు తీసుకొచ్చింది. క్షణం సినిమాలో మంచి రోల్ చేశాను. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.

  స్లైడ్ షోలో అనసూయ ఇంటర్వ్యూ వివరాలు, ఫోటోస్...

  ఆయన కోసమే చేసా

  ఆయన కోసమే చేసా

  సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో రెండు సీన్స్, ఒక సాంగ్ అనగానే ముందు చేయకూడదని అనుకున్నాను. కానీ నాగార్జునకి నేను పెద్ద ప్యాన్. కేవలం ఆయన కోసమే నిమా చేయడానికి ఒప్పుకున్నాను అన్నారు.

  పెళ్లయితే ఏంటి?

  పెళ్లయితే ఏంటి?

  బాలీవుడ్ లో చాలా మంది పెళ్ళైన హీరోయిన్స్ ఉన్నారు. అక్కడ వారు స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేస్తున్నారా..? లేదా..? అనే చూస్తారు...నా విషయంలో కూడా అందరూ అలానే భావిస్తే బావుంటుంది అన్నారు.

  ఫ్యాన్స్, హేటర్స్

  ఫ్యాన్స్, హేటర్స్

  నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే మంది హేటర్స్ కూడా ఉన్నారు. కాని నేనెవరిని పట్టించుకోను. స్క్రీన్ మీద ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నాకు ముఖ్యం అని కుండ బద్దలు కొట్టారు అనసూయ.

  సినిమాలే ఈజీ

  సినిమాలే ఈజీ

  టీవీ రంగం నుండి సినిమా రంగం వైపు వచ్చిన అనసూయ... టెలివిజన్ యాంకర్ గా కంటే సినిమాల్లోనే నటించడం సులువు అని స్పష్టం చేసింది.

  నా స్వార్థం కూడా ఉంది

  నా స్వార్థం కూడా ఉంది

  టెలివిజన్ షోలలో నేనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. కాని సినిమాల్లో అలా ఉండదు. ఆ స్వార్ధంతోనే నేను సినిమాలపై ఆసక్తి చపలేదు. కానీ మంచి అవకాశాలు వస్తుండటంతో నటిస్తున్నాను అన్నారు అనసూయ.

  క్షణం మూవీలో అవకాశం గురించి

  క్షణం మూవీలో అవకాశం గురించి

  శేష్ నేను అమెరికాలో ఉన్నప్పుడు సినిమా చేయాలని అన్నారు. అయితే నేను అప్పుడు అమెరికాలో ఉన్నందువల్ల కుదరలేదు. ఇండియా రాగానే కథ విన్నాను...నచ్చడంతో ఓకే చెప్పాను.

  అదాశర్మ క్యారెక్టర్ అనుకున్నాను.

  అదాశర్మ క్యారెక్టర్ అనుకున్నాను.

  ముందు ఆదాశర్మ చేసిన క్యారెక్టర్ నాకు ఇస్తారేమో అనుకున్నాను. కానీ జయా భరద్వాజ్ అనే పోలీస్ పాత్ర అని తర్వాత తెలసింది.

  పోలీస్ క్యారెక్టరే కానీ..

  పోలీస్ క్యారెక్టరే కానీ..

  క్షణం సినిమాలో నేను చేసేది పోలీస్ క్యారెక్టరే అయినప్పటికీ ఎక్కడా ఖాకీ డ్రెస్ లో కనపడను అని చెప్పారు అనసూయ.

  షూటింగ్ టైంకి కాన్ఫిడెన్స్ వచ్చింది

  షూటింగ్ టైంకి కాన్ఫిడెన్స్ వచ్చింది

  మొదట ఈ పాత్రలో నేను చేయగలనా..? అనుకున్నాను. షూటింగ్ టైంకి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి పాత్ర. అయితే ఈ పాత్ర కోసం ఎవరినీ అనుకరించలేదు అని స్పష్టం చేసారు అనసూయ.

  టీవీ రంగంలో కొనసాగుతా

  టీవీ రంగంలో కొనసాగుతా

  నేను సినిమాల్లోకి రాకముందు టీవీ ద్వారానే అందరికీ దగ్గరయ్యాను. సినిమాల్లో అవకాశం వస్తుంది కదా అని టీవీని వదులుకోను అన్నారు అనసూయ.

  English summary
  Anasuya will now be performing as a cop in her upcoming film titled Kshanam. Check out Anasuya Bharadwaj interview about Kshanam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X