twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush పొలిటికల్ వివాదంలో ప్రభాస్ మూవీ.. బీజేపీ ఎజెండాలో 16 సినిమాలు.. కేటీఆర్ ఫైర్

    |

    సాధారణంగా హీరో ప్రభాస్ ఎలాంటి వివాదాల జోలికి పోరు. స్వభావరీత్యా సిగ్గరి కావడంతో ఆయన పెద్దగా బయట కనిపించడం కూడా జరగదు. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా ఆచితూచి ఎంచుకుంటాడు కాబట్టి ఆ సినిమాలు వివాదాస్పదం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. అయితే ఆయన నటిస్తున్న ఒక సినిమా అనుకోని రీతిలో ఇప్పుడు పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత కె.తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ప్లాన్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వివరాల్లోకి వెళితే

    పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో

    పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో

    బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తో బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపించారు. అందులో భాగంగానే బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ ప్రభాస్ రాముడి పాత్రలో ఆది పురుష్ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాను తానాజీ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

     మొత్తం 16 సినిమాలను

    మొత్తం 16 సినిమాలను

    ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో కనిపిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసుర పాత్రలో కనిపిస్తున్నారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ వివాదం నెలకొన్న క్రమంలో కేటీఆర్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మీద సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి అజెండాలో భాగంగా ఆది పురుష్ సినిమా తెరకెక్కుతోందని దేశం మొత్తం బిజెపి భావజాల వ్యాప్తి చేసేందుకు బీజేపీ మొత్తం 16 సినిమాలను సిద్ధం చేస్తోందని ఆరోపించారు.

    రామ రాజ్యం అంటే బీజేపీ

    రామ రాజ్యం అంటే బీజేపీ

    వాటిలో ఇప్పటికే ఉరి, ది కాశ్మీర్ పైల్స్ లాంటి సినిమాలు విడుదలయ్యాయి ఇకమీదట ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది మిగతా సినిమాలను కూడా సమయం చూసుకుని విడుదల చేస్తారని ఆయన ఆరోపించారు. ప్రభాస్ సినిమా ద్వారా మరోసారి శ్రీరాముడు సెంటిమెంట్ రెచ్చగొట్టి రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వమే అనే భావన కల్పించడం కోసమే ఈ సినిమా చేస్తున్నారని ఆరోపించారు.

    బీజేపీ అజెండాలో భాగమని

    బీజేపీ అజెండాలో భాగమని

    సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేస్తారని ఇదంతా బీజేపీ అజెండాలో భాగమని ఆయన ఆరోపించారు.. ఈ సినిమాలో దేశభక్తి, బీజేపీ సిద్ధాంతాలు అంతర్లీనంగా ప్రజలకు చేరవేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఎలా అయితే కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టాక్స్ తగ్గించి ప్రమోషన్స్ చేసి మరీ సినిమాలు హిట్ చేశారో ఆదిపురుష్ విషయంలో కూడా అదే చేస్తారని ఆయన ఆరోపించారు.

    ప్రభాస్ కి కూడా

    ప్రభాస్ కి కూడా

    అయితే ఈ విషయం మీద ప్రభాస్ కి కూడా అవగాహన ఉండి ఉండవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన క్రమంలో ప్రభాస్ కి బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఆయనే ఆలోచించుకోవాలి

    ఆయనే ఆలోచించుకోవాలి

    అయితే ఈ విషయం మీద ప్రభాస్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు ఒక హిందూ దేవుడి గురించి సినిమా తీస్తే కూడా పార్టీలు అంటగడతారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న తమ హీరో ఒక పార్టీ కోసం ఇలాంటి సినిమాలు చేస్తారా అనేది ఆయనే ఆలోచించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

    English summary
    KTR alleges that Prabhas starrer Adipurush is being made for the benefits of bjp.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X