»   » సమంతా చైతన్యలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు, దర్శకేంద్రుడు, త్రిష ట్విట్టర్ లో ఇలా

సమంతా చైతన్యలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు, దర్శకేంద్రుడు, త్రిష ట్విట్టర్ లో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత సంవత్సర కాలంగా టాలీవుడ్ లో మోస్ట్ హాటెస్ట్ టాపిక్ చైతన్య సమంతల లవ్, దాదాపుగా ఈ ఇద్దరి ప్రేమ విషయం చర్చించని సామాజిక, ప్రసార మాద్ఘ్యమం లేనే లేదు, ప్రతీ వారం ఒక కొత్త ఫొటో, కొత్త వార్త ఈ ఇద్దరి ప్రేమ కథ గురించే. అక్కినేని అభిమానులూ, సమంతా అభిమానులే కాదు దాదాపుగా తెలుగు సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ వీళ్ల పెళ్ళి కోసం ఎదురు చుసారు.

ఎట్టకేలకు గురువారం వేద మంత్రాల సాక్షిగా వీరి పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11 :52 నిమిషాలకు ముఖ్యమైన అతిథుల సమక్షంలో.. డబ్ల్యు రిసార్ట్స్‌లో వైభవంగా వివాహం జరిగింది. హ్యండ్లూమ్స్‌కి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సామ్‌కు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు .

KTR congratulats Samantha on Her Marriege with Naga chaithanya

"మా హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్.. నాకు తెలిసిన వారిలోనే నైసెస్ట్ పర్సన్ అయిన సమంతకు.. చై అక్కినేనికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సింపుల్ అండ్ స్వీట్‌గా "శతమానం భవతి" అని ట్వీట్ చేశారు. హీరోయిన్ త్రిష కూడా "ప్రేమ కథల పట్ల తనకున్న నమ్మకాన్ని నిలబెట్టిన నాగచైతన్య-సమంతకు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.

English summary
"Many congratulations to our Handlooms Brand Ambassador & one of the nicest people I know Samanthaprabhu2 on her wedding with chay akkineni" Tweets KTR
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu