»   » టి మంత్రి కేటీఆర్ కి థాంక్స్ చెప్పిన హీరో సూర్య

టి మంత్రి కేటీఆర్ కి థాంక్స్ చెప్పిన హీరో సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '24'. ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా చూసారం. సినిమా బాగా నచ్చడంతో ట్వీట్ చేసారు.

24 క్యారెట్ బ్రిలియన్సి ...(సూర్య '24' రివ్యూ)

'24 చూశాను. బ్రిలియంట్‌ స్క్రీన్‌ ప్లే, అద్భుతమైన నటన. నా కుమారుడు, కుమార్తె సినిమా చూడాలంటున్నారు' అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు సూర్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. దీనికి హీరో సూర్య తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందిస్తూ... కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ '24' నచ్చడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

KTR praises Surya acting in 24

2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూర్చారు. సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది.

KTR praises Surya acting in 24

స్టోరీ...
సైంటిస్టు శివకుమార్‌ (సూర్య) కష్టపడి.. కాలాన్ని నియంత్రణ చేయగల వాచిని కనిపెడతాడు. ఇలాంటి అన్ని కథల్లోలాగానే దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర కు తెచ్చుకోవాలని ఎంతకైనా తెగించే ఓ విలన్ దాని పై పడుతుంది . ఆ విలన్ మరెవరో కాదు..ఈ సైంటిస్టు అన్నయ్యే ఆత్రేయ (సూర్య) . ఆ విలన్ ...తన తమ్ముడని కూడా చూడకుండా శివకుమార్ ని అతని భార్య ప్రియ(నిత్యామీనన్) ని చంపేసి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి సైంటిస్టు శివకుమార్ తెలివితక్కువవాడా....ఆ వాచి ఎట్టి పరిస్దితుల్లో విలన్ కు దక్కకూడదని, పసిగుడ్డు అయిన తన కొడుకు మణిశంకర్(సూర్య) ఒడిలో పెట్టి వేరేవారికి అప్పచెప్తాడు. 24 సంవత్సరాలు గడిచి, పెద్దయ్యాక మణి శంకర్ ..ఈ వాచి విషయం ఎలా తెలిసింది. తన తల్లిని, తండ్రిని చంపిన ఆత్రేయపై పగ తీర్చుకున్నాడా...ఏం చేసాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో సత్య (సమంత) తో లవ్ స్టోరీ ఎలా కలిపారు అనేది తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.

English summary
Thank You Very Much Sir! All Liked 24!' Cinema Star Surya tweeted in reply to a tweet by Telangana Information Minister K Taraka Ramarao on Wednesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu