నేను కాదు, సోనూసూద్ సూపర్ హీరో.. కేటిఆర్ మాటలకు అదిరిపోయేలా ఆన్సర్ ఇచ్చిన సోనూసూద్

కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సహాయలు అంధించి ఏకైక రియాల్ హీరో సోనూసూద్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఎడాది నుంచి నిర్విరామంగా తనకు సాధ్యమయినంత వరకు సహాయలు చేస్తూనే ఉన్నాడు. ఇక సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు కూడా చాలా మంది సోనూసూద్ రియల్ హీరో అని పొగుడుతున్నారు. రీసెంట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం అదే అన్నారు. ఇక సోనూసూద్ అందుకు పాజిటివ్ గా సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు.

Recommended Video

Sonu Sood A Superhero - KTR Tweets | Oneindia Telugu
సోనూసూద్ కు పాలాభిషేకం

సోనూసూద్ కు పాలాభిషేకం

సోనూసూద్ అంటే ఇప్పుడు ఒక సినీ నటుడు కాదు. ఆపదలో ఆదుకునే ఒక ఆపద్బాంధవుడు కూడా. భాషతో సంబంధం లేకుండా ప్రతి గ్రామాల్లో కూడా సోనూసూద్ కు పాలాభిషేకం చేస్తున్నారు. సహాయం పొందిన వారిలో అతను దేవుడయ్యాడు. సోనూసూద్ చేస్తున్న పనులకు పలువురు తారలు కూడా విరాళాలు అందిస్తూ మరింత అండగా నిలుస్తున్నారు.

కేటీఆర్ ను రియల్ హీరో అనడంతో

కేటీఆర్ ను రియల్ హీరో అనడంతో

ఇక ఇటీవల తెలంగాణ మంత్రి కూడా ఒక్క మాటతో సోనూసూద్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా కేటీఆర్ కూడా పబ్లిక్ సర్వెంట్ గానే అడిగిన వారికి సహాయం చేస్తున్నాడు. కరోనా కోరల్లో చిక్కుకున్న వారికి సకాలంలో వైద్యం అందిస్తున్నారు. ఇటీవల ఆక్సిజన్ సిలిండర్స్ సకాలంలో అందించడంతో కేటీఆర్ ను రియల్ హీరో అని సంభోదించారు.

సోనూసూద్ రియల్ హీరో అంటూ..c

సోనూసూద్ రియల్ హీరో అంటూ..c

నేను ఎన్నుకొబడిన ప్రజా ప్రతినిధిని మాత్రమే అంటూ మీరు సోనూసూద్ ను రియల్ హీరో అని అనవచ్చని అన్నారు. అలాగే మీరు వీలైనంత వరకు మీ తోటి వారికి సహాయం చేయండి అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఆ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అవ్వడంతో సోనూసూద్ వరకు వెళ్లింది.

కేటీఆర్ కామెంట్స్ పై సోనూసూద్ రియాక్షన్

కేటీఆర్ కామెంట్స్ పై సోనూసూద్ రియాక్షన్

కేటీఆర్ మాటలకు సోనూసూద్ ఈ విధంగా స్పందించాడు.. మీ మంచి మాటలకు చాలా కృతజ్ఞతలు సార్. కానీ మీరే నిజమైన హీరో. తెలంగాణకు ఎంతో చేశారు. మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒక విధంగా తెలంగాణ నాకు రెండవ ఇల్లు లాంటిది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో అభిమాణిస్తున్నారు.. అని సోనూసూద్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X