twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను నేను చూసుకొంటూ ఏడ్చాను: శ్రీహరి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ''ఈ సినిమాలో నన్ను నేను చూసుకొంటూ ఏడ్చాను. చరిత్ర ఉన్నంతకాలం పల్లెకన్నీరు పెడుతుందో... పాట నిలిచిపోతుంది. సీక్వెల్‌ తీస్తే పారితోషికం తీసుకోకుండా నటిస్తాను''అన్నారు శ్రీహరి. నక్సల్‌ సమస్య, అంతరించిన కులవృత్తులు, గ్రామీణ జీవితాన్ని అద్దం పట్టేలా ఆవిష్కరించిన చిత్రం కుబుసం.ఈ చిత్రం విడుదలై పదేళ్త్లెన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

    అలాగే 'పదేళ్ల తర్వాత ఈ సినిమా గురించి ఎక్కువ మాటాట్లాడితే నా కాళ్లకు నేనే దండం పెట్టుకున్నట్టవుతుంది. కుబుసం సినిమా చూస్తూ నేను బాగా నటించానా అని కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇంత మంచి టీమ్‌ని వదిలి పదేళ్ల్లవుతోందా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు చాలా కష్ట్టాలు పడ్డారు అని శ్రీహరి అన్నారు. ''పల్లె కన్నీరు... పాట గురించే ఈ సినిమా తీశాను''అన్నారు దర్శకుడు శ్రీనాధ్

    ఇక తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ ''తెలంగాణలోని పల్లె సీమల స్థితిగతుల్ని చక్కగా ప్రతిబింబించారు దర్శకుడు. పోలీసులు, నక్సలైట్లు... ఇరువైపుల ఆవేదనను చాలా బాగా చెప్పారు. ఇందులోని పల్లె కన్నీరు పెడుతుందో... అనే పాట అప్పటి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. ఈ సినిమాలో చూపించిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతూ రెండో భాగాన్ని కూడా చిత్రించాలని' చిత్రబృందాన్ని కోరారు. అలాగే ''శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఉద్యమాన్ని ఎవరూ అణచివేయలేరనే విషయాన్ని ఎంతో మంది మేధావులు చెప్పారు. ఆ విషయాన్ని 'కుబుసం' చిత్రంలో మరింత ప్రభావితంగా చూపించారు''అన్నారు కేటీఆర్‌.

    శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమది. ఎల్‌.శ్రీనాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 3తో ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. 'ఇలాంటి కథ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి కానీ ఇంత లోతుగా సమస్యని ఏ సినిమాలోనూ చర్చించలేదు. పదేళ్ల తర్వాత కూడా కొత్త సినిమా చూసినట్టే వుంది' అని తమ్మాడ్డి భరద్వాజ తెలిపారు. భాజపా నాయకులు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ''ఇందులో చెప్పిన సమస్యల్ని భాజపా కేంద్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్తాను''అన్నారు.. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు శ్రవణ్‌ కుమార్‌, ప్రదీప్‌రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్‌, ప్రసన్నకుమార్‌, గోరేటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Kubusam,' the critically acclaimed film with Sri Hari in the lead role, which released on August 3, 2002, has successfully completed 10 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X