»   » సుకుమార్... ‘కుమారి 21 ఎఫ్’ తాజా వివరాలు!

సుకుమార్... ‘కుమారి 21 ఎఫ్’ తాజా వివరాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్'. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆయనే అందిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.

‘Kumari 21F’ completes its talkie part

సుకుమార్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది అని తెలిపారు.

దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄఎష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
‘Kumari 21F’ movie completes its talkie part.
Please Wait while comments are loading...