»   »  అజిత్ కొడుకు ఫస్ట్ బర్త్ డే: అదరగొట్టిన ఫ్యాన్స్ (ఫోటోస్)

అజిత్ కొడుకు ఫస్ట్ బర్త్ డే: అదరగొట్టిన ఫ్యాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ కొడుకు అద్విక్ తొలి బర్త్ డే సెలబ్రేషన్స్ బుధవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. అజిత్‌ను ‘తాలా' అంటూ ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ అద్విక్ ను ‘కుట్టీ తాలా' అంటూ పిలుస్తున్నారు. అద్విక్ బర్త్ డే సందర్భంగా చెన్నై నగరంతో పాటు తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో అదిరిపోయేలా సెలబ్రేషన్స్ నిర్వహించారు అభిమానులు.

మార్చి2, 2015న అద్విక్ జన్మించాడు. స్టార్ హీరో కొడుకు కావడంతో అద్విక్ పుట్టుకతోనే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అజిత్ ఫ్యాన్స్ అతనికి కుట్టీ తాలా అనే బిరుదు కూడా తగిలించేసారు. అజిత్ సినిమా విడుదలైనపుడు.... కుట్టి తాలా ఫోటోలతో కూడా బ్యానర్లు కతుండటం విశేషం.

అద్విక్ తొలి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నై వ్యాప్తంగా బ్యానర్లు కట్టి హోరెత్తించారు. ఇప్పటి నుండే అద్విక్ ఈ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడంటే ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అజిత్-శాలిని దంపతులకు 8 ఏళ్ల కూతురు అనౌష్క ఉన్న సంగతి తెలిసిందే.

అజిత్-శాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 'అమరకలమ్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో వీరిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు మీడియా సాక్షిగా వారు తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 2000లో వివాహం చేసుకున్నారు.

అజిత్ కుమార్ హిందూ అయితే, శాలిని క్రిస్టియన్. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా శాలిని తను కమిటైన రెండు ప్రాజెక్టులను పూర్తి చేసారు. ఆ తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పారు. వీరికి 2008 జనవరి 8వ తేదీన పాప జన్మించింది. తమ కూతురుకి అనౌష్క అనే పేరు పెట్టుకున్నారు.

అద్విక్ బర్త్ డే

అద్విక్ బర్త్ డే


అజత్ కుమారుడు అద్విక్ బర్త్ డే సెలబ్రేషన్స్...

క్యూట్ బాయ్

క్యూట్ బాయ్


అజిత్ కుమారుడు అద్విక్ ఎంతో క్యూట్ గా ఉండటంతో అందరికీ తెగనచ్చేస్తున్నాడు.

తల్లితో..

తల్లితో..


తల్లి శాలినితో అద్విక్.

బర్త్ డే సెలబ్రేషన్స్

బర్త్ డే సెలబ్రేషన్స్


కుట్టి తాళా అద్విక్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటో...

బుల్లి పంచెకట్టు...

బుల్లి పంచెకట్టు...


బర్త్ డే సందర్బంగా అద్విక్ బుల్లి పంచెకట్టులో దర్శనమిచ్చాడు.

అనౌష్క

అనౌష్క


తమ్ముడి బర్త్ డే సందర్భంగా పాట పాడుతున్న అనౌష్క

అంకుల్ తో..

అంకుల్ తో..


తన అంకుల్ రిచర్డ్ తో కుట్టి తాళా అద్విక్.

డ్రెస్సు అదిరింది

డ్రెస్సు అదిరింది


తమిళ సాంప్రదాయ పద్దతిలో బుల్లి పంచెకట్టులో అద్విక్.

అద్విక్..

అద్విక్..


బర్త్ డే వేడుకలో తల్లితో కలిసి అద్విక్

ఫ్యాన్స్

ఫ్యాన్స్


అద్విక్ బర్త్ డేను సెలబ్రేట్ చేస్తున్న అజిత్ అభిమానులు.

కేక్ కటింగ్

కేక్ కటింగ్


అద్విక్ బర్త్ డే సందర్భంగా పలు చోట్ల అభిమాన సంఘాలు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

బేనర్లు

బేనర్లు


చెన్నై వ్యాప్తంగా పలు చోట్ల అద్విక్ బర్త్ డే సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేసారు అభిమానులు.

అన్నదానం

అన్నదానం


అద్విక్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అభిమానం

అభిమానం


తమిళనాడులో భారీగా అభిమానులను కలిగి ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు.

ఫ్యాన్స్

ఫ్యాన్స్


వివిధ ప్రాంతాల్లో అద్విక్ బర్త్ డే సందర్భంగా అభిమానులు బేనర్లు ఏర్పాటు చేసారు.

బైక్ రేసర్

బైక్ రేసర్


అజిత్ బైక్ రేసర్ కావడంతో.... అద్విక్ ను కూడా అలాంటి ఫోజుల్లో చూపుతూ బేనర్లు ఏర్పాటు చేసారు.

సంబరాలు

సంబరాలు


అజిత్ పుట్టినరోజును ఏవిధంగా జరుపుతారో... అంతకంటే గ్రాండ్ గా అద్విక్ పుట్టినరోజు వేడుక జరిపారు.

సినిమా పోస్టర్లలో కూడా..

సినిమా పోస్టర్లలో కూడా..


అజిత్ సినిమాలకు సంబంధించిన పోస్టర్లలో కూడా అద్విక్ పోటులు ఉండటం గమనార్హం.

శాలిని పోస్టర్లు

శాలిని పోస్టర్లు


అద్విక్ పుట్టినరోజు సందర్భంగా తల్లి శాలినితో కలిసి ఉన్న బేనర్లు కూడా ఏర్పాటు చేసారు.

ఫ్యాన్స్

ఫ్యాన్స్


అద్విక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు.

చెన్నై మొత్తం

చెన్నై మొత్తం


చెన్నైలో పలు ప్రాంతాల్లో గోడలపై అద్విక్ పుట్టినరోజుకు సంబంధించిన పోస్టర్లు.

అనాదలకు అన్నదానం

అనాదలకు అన్నదానం


అద్విక్ పుట్టినరోజు సందర్భంగా అభాగ్యులకు, అనాదలకు అన్నదానం చేసారు అభిమానులు.

English summary
'Kutty Thala' as he is fondly called by well-wishers and ardent fans of Thala Ajith, Aadvik celebrated his first birthday on March 2nd with his kins and close friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu