»   » ట్రైలర్ అంతా పచ్చి బూతుమయం (వీడియో)

ట్రైలర్ అంతా పచ్చి బూతుమయం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌ ఏది చేసినా సంచలనమే. ఆ మధ్యన 'త్రిఫుల్‌ ఎక్స్‌' అంటూ అడల్ట్‌ టైటిల్‌ని పెట్టి హల్‌చల్‌ చేసిన ఆమె ఇప్పుడు 'క్యా కూల్‌ హై హమ్‌ 3' ట్రైలర్ ని వదిలి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ట్రైలర్ పూర్తి బూతుగా ఉంది.

అలాగే తుషార్‌కపూర్‌, అఫ్తాబ్‌ శివదాసాని, ఇరానియన్‌ మోడల్‌ మండానా కరీమి నటిస్తున్న 'క్యా కూల్‌ హై హమ్‌ 3' చిత్రంలోని ఓ స్పెషల్‌ ఐటమ్‌సాంగ్‌ కోసం ఐటెమ్‌ స్పెషలిస్ట్‌ గౌహర్‌ఖాన్‌ని ఏక్తాకపూర్‌ ఎంపిక చేసింది.

మరో ప్రక్క "క్యా కూల్ హై హమ్ 3" ట్రైలర్ ను "పోర్న్ సైట్స్"లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదేమిటని అడిగితే.. "ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న తుషార్ కపూర్ మరియు అఫ్తాబ్ లు పోర్న్ స్టార్లుగా నటిస్తున్నారు. అందువల్ల మా సినిమా ట్రైలర్ ను "పోర్న్ సైట్స్"లో విడుదల చేయడమే సమంజసం అనిపించింది" అంటూ సమాధానం చెబుతున్నాడు దర్శకుడు ఉమేష్.

ఓ ఇద్దరి యువకుల ఊహలో వచ్చే ఈ ఐటమ్‌సాంగ్‌లో గౌహర్‌ఖాన్‌ అందాలవిందు చేయనుందని తెలిసింది. కేవలం ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం గౌహర్‌ఖాన్‌కి ఏక్తా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పారని సమాచారం.

ఓ ప్రత్యేక సెట్‌లో ఈ పాటను తుషార్‌కపూర్‌, ఆఫ్తాబ్‌లతోపాటు 500మంది డాన్సర్లతో గౌహర్‌ ఈ పాటలో డాన్స్‌ చేయనుంది. ఏక్తా సినిమాల్లో హీరోయిన్స్ లే అందాల్ని ఆరబోస్తారు.. అలాంటిది ఐటెమ్‌గార్ల్‌తో ఐటెమ్‌సాంగంటే.. ఇక వేరే చెప్పాలా..అంటున్నారు.

English summary
Kya Kool Hain Hum 3 is an upcoming Bollywood adult comedy film starring Tusshar Kapoor, Aftab Shivdasani and Mandana Karimi in lead roles. Gauahar Khan will be seen in a Special appearance in a song. Movie is scheduled to release earlier in 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu