»   » ఎల్ బి శ్రీరాం సొంత ఛానెల్, ఎందుకోసమంటే...

ఎల్ బి శ్రీరాం సొంత ఛానెల్, ఎందుకోసమంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ రచయిత,నటుడు ఎల్ బి శ్రీరాం వెబ్ ఛానెల్ మొదలుపెడుతున్నారు. అదేంటి ఇప్పుడు ఈయనకి హఠాత్తుగా వెబ్ ఛానెల్ అవసరం ఏమి వచ్చిందీ అంటారా.. ఎందుకంటే ఆయన వరసపెట్టి షార్ట్ ఫిల్మ్ లు అందిచటానికి రెడీ అవుతున్నారు. వీటిని ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్తున్నారు.

నేటి ట్రెండ్‌కి తగినట్టు షార్ట్ ఫిల్మ్ లతో వెబ్ ప్రపంచంలోనికి అడుగుపెట్టనున్నట్టు ఎల్.బి.శ్రీరామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎల్.బి. (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) క్రియేషన్స్ బ్యానర్‌లో ఎల్.బి.శ్రీరామ్ హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు చేయనున్నారు.

మే 30న తన పుట్టినరోజునే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న ఈయన కమర్షియల్ సినిమాలు కడుపు నింపడానికే అంటూ తనవైన భావాలు ఈ లఘుచిత్రాల ద్వారా వ్యక్తపరచడంతో మనసు నిండుతుందన్నారు.

ఎల్.బి.శ్రీరామ్ స్పందిస్తూ...విజ‌యం తెచ్చిన గ‌ర్వం లేదు కానీ...దానితో వ‌చ్చిన గౌర‌వం ఉంది. వీట‌న్నింటికి తోడు కొత్త‌గా ఇంకా ఏదో చేయాలి అనే త‌ప‌న ఉంది. క‌డుపు నింప‌డానికి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు వ‌స్తుంటాయి. కానీ... మ‌న‌సు నింప‌డానికి నేనే చేయాలి..త‌రం ఏదైనా కొత్త‌ని ప‌ట్టుకోవాలి...పాత‌ని ప‌ట్టికెళ్లాలి.

L.B. Sreeram is in tune with the times

న‌ది కూడా కొత్త నీరు వ‌చ్చిన‌ప్పుడు పాత నీరుని క‌లుపుకునే వెళుతుంది..అందుకే నేడు ప్ర‌పంచాన్ని ఏలుతున్న ఇంట‌ర్నెట్ రంగంలోకి అడుగుపెడుతున్నాను. నా భావాలు..ఈత‌రం వాళ్ల‌కు విసుగు ర‌ప్పించ‌కూడ‌దు అని షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకున్నాను.

నా భావాలు నా గుండెల్లోంచి వ‌చ్చిన‌వి కాబ‌ట్టే...వాటికి ఎల్.బి.శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నాను. మే 30 నా పుట్టిన‌రోజు. ఆరోజు నుంచి నా సెకండ్ ఇన్నింగ్స్ ...ఆడియోన్స్ స‌క్సెస్ చేస్తే..సెకండ్ విన్నింగ్స్ మొద‌లవుతుంది అన్నారు.

English summary
Senior actor and scriptwriter L B Sreeram is producing a web series of short films titled ‘Life is Beautiful’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu