»   » రాహూల్ మూవీ మేకర్స్ ఎల్7

రాహూల్ మూవీ మేకర్స్ ఎల్7

Posted By:
Subscribe to Filmibeat Telugu

'తుంగభద్ర' ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'. ఈ చిత్ర నిర్మాత గతంలో 'ఈ వర్షం సాక్షిగా' వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ "లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోని రిలీజ్ చేసాము. ఆడియో కి మంచి మంచి రెస్పాన్స్ వచ్చ్చింది. మా చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఇష్క్' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నామన్నారు.

English summary
Tollywood movie L7 Platinum Disc Function held at Prasad labs, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu