»   »  కళాభవన్ మణి మృతిపై ట్విస్ట్: విషం ఉందని తేల్చారు!

కళాభవన్ మణి మృతిపై ట్విస్ట్: విషం ఉందని తేల్చారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి మార్చి మొదటి వారంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం సహజంగా లేదని, అనేక అనుమానాలున్నాయని మొదటి నుండి పలు వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్టుతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్వహించిన టెస్టుల్లో ఇది రుజువైంది. అయితే అది ఆయన మరణానికి ఎంతవరకు కారణం అయిందనేది తేలాల్సి ఉంది.

Lab confirms methanol in Kalabhavan Mani's body

ఇంతకు ముందు కొచ్చిలోని ప్రాంతీయ రసాయన పరీక్ష కేంద్రంలో జరిపిన టెస్టులో ఆయన శరీరంలో ప్రమాద కరమైన 'క్లోర్ పిరిఫోస్' అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చారు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన టెస్టులో మాత్రం ఆయన శరీరంలో పురుగు మందు అవశేషాలే ఏమీ లేవని తేలిపోయింది. అయితే ఒక్కో రిపోర్టు ఒక్కో రకంగా రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

మరో వైపు కేరళలోని ఆయన అభిమానులు కూడా ఈ రిపోర్టతో అయోమయానికి గురవుతున్నారు. తమ అభిమాన నటుడి మరణం విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వారిని షాక్ కు గురి చేస్తోంది.

English summary
Nearly three months after Malayalam actor Kalabhavan Mani's death, a forensic examination has confir...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X