»   » రాజమౌళి శిష్యుడు రిలీజ్ డేట్ ఇచ్చాడు

రాజమౌళి శిష్యుడు రిలీజ్ డేట్ ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది' . మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శకత్వశాఖ లో పని చేసారు దర్శకుడు జగదీష్ తలశిల. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్రం సరికొత్త ట్రైలర్‌ విడుదలైంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ అభిమానులతో పంచుకుంది.


నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది'. టి. జగదీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి ప్రసాద్‌ కామినేని నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.


నిర్మాత సాయి ప్రసాద్ కామినేని మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. జగదీష్ నా స్నేహితుడు, అతనిలో ఉన్న మంచి టెక్నీషీయన్ ని గుర్తించి ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి గారి మాటలు వినగానే నా నమ్మకానికి బలం చేకూరింది. ప్రతి సన్నివేశాన్ని లింక్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా జగదీష్ తెరకెక్కించాడు. అందాల రాక్షసి తరవాత నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి కలసి నటిస్తున్న సినిమా ఇది. ప్రతి సన్నివేశంలో వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. జనం తెలుసుకోవాల్సిన కొత్త పాయింట్ తో, జనానికి అర్ధమయ్యే రీతి లో ‘కాన్ కామెడీ' థ్రిల్లర్ గా ‘'లచ్చిందేవికి ఓ లెక్కుంది'' నిర్మించాం. మా ఈ చిత్రంతో ఈ నెల 29న మీ ముందుకు వస్తున్నాం. లచ్చిందేవి ఆశిస్సులు మీకు, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.


Lacchimdeviki O Lekkundi Movie Theatrical Trailer

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్‌, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి, పాటలు: శివశక్తిదత్తా, అనంతశ్రీరాం, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు, డిఓపి: ఈశ్వర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఈ. మధుసూదన్‌రావు, నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని, రచన-దర్శకత్వం: జగదీశ్‌ తలశిల.

English summary
Lacchimdeviki O Lekkundi - LOL will be coming to theatres on 29th January. S S Rajamouli’s protege Jagadish Talasila is directing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu