»   » హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీదర్ తనయుడు, విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించిన విక్రమ్ కన్నడ సినిమాతో లీడ్ యాక్టర్ గా మారుతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

తమిళంలో ఘనవిజయం సాధించిన గోలీసోడా సినిమాను అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో లగడపాటి శ్రీదర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ తో పాటు కన్నడ నటులు సాధు కోకిల, అరుణ్ సాగర్ ల తనయులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కన్నడలో రిలీజ్ తరువాత తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు లగడపాటి శ్రీధర్.

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

నటవారసులే గాక.. బాలనటులు కాస్తా హీరోలైపోతున్న సందర్భమిది. తనీష్‌, మనోజ్‌నందం ఇలా వచ్చినవారే. ఇదే జాబితాలోకి వస్తున్నాడు మాష్టర్‌ విక్రమ్‌ సహిదేవ్‌. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తనయుడు

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో లగడపాటి శ్రీధర్ కూడా ఒకరు. ఇప్పటికే ఈయన కుమారుడు విక్రమ్ సహిదేవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు. స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రలు చేసిన విక్రమ్ ఆడియన్స్ కు బాగానే నోటీస్ అయ్యాడు. రేసుగుర్రంలో చిన్నప్పటి బన్నీ కేరక్టర్ చేసింది ఇతనే.

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

ఇప్పడీ విక్రమ్ సహిదేవ్... కన్నడలో లీడ్ రోల్ చేస్తూ ఓ సినిమాలో నటించాడు. కోలీవుడ్ మూవీ గోలీసోడాకు కన్నడ రీమేక్ ఇది. కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల కథే ఈ చిత్రం.

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

నలుగురిలో ఒకడిగా విక్రమ్ కనిపిస్తాడు. ఈ నలుగురిలో మిగిలిన వాళ్లు కూడా సెలబ్రిటీల పిల్లలే కావడం విశేషం. కన్నడ యాక్టర్ సురాగ్ - సాధు కోకిల కుమారుడు - మరో యాక్టర్ అరుణ్ సాగర్ కుమారుడు నటించారు.

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

హీరోగా వస్తున్న లగడపాటి.., కన్నడ సినిమా గోలీసోడా లో

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు లగడపాటి శ్రీధర్ సిద్ధమవుతున్నారు. తన కుమారుడిని తెలుగులో అరంగేట్రం చేయించండతో పాటే.. మరి కొందరు సెలబ్రిటీల పిల్లలతో ఈ గోలీసోడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

English summary
Popular producer Lagadapati Sreedhar’s son Vikram Sahadev made his presence felt with appearances in hit Telugu movies like Race Gurram & Rudramadevi.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu