»   » సినిమాల్లో లగడపాటి తనయుడు...హీరో అవడమే లక్ష్యం!

సినిమాల్లో లగడపాటి తనయుడు...హీరో అవడమే లక్ష్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం సినిమా పరిశ్రమ వారసులతో నిండిపోతుందనేది వాస్తవం. నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకలు, రచయితలు, కమెడియన్లు ఇలా సినిమా రంగంలో ఉన్న వారు తమ వారసులను పరిశ్రమలోకి దింపుతున్నారు. చిన్నతనంలోనే వారిని పరిశ్రమకు పరిచయం చేయడం ద్వారా భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు.

తాజాగా అదే బాటలో వస్తున్నాడు ప్రముఖ తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్. గతంలో స్నేహ గీతం, వియ్యాల వారి కయ్యాలు లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన విక్రమ్ సహిదేవ్...ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' చిత్రంలో కూడా నటించాడు.

Lagadapati Sridhar's son Vikram Sahidev in Race Gurram

రేసు గుర్రం చిత్రంలో అల్లు అర్జున్ చిన్ననాటి పాత్రను విక్రమ్ సహిదేవ్ పోషించాడు. సినిమాలో కనిపించేది కాసేపే అయినా డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఇపుడు విక్రమ్ సహిదేవ్‌కు మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయట. ఇలా సినిమా పరిశ్రమ మొత్తం వారసులతో నిండి పోతుంటే....సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్న సాధారణ జనాల పరిస్థితి ఏమిటో?

English summary
Tollywood producere Lagadapati Sridhar's son Vikram Sahidev in Race Gurram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu