twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి చేతికి రజనీకాంత్ సినిమా, భారీగా ఖర్చు!

    |

    హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో 'కొచ్చాడయాన్' అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఏపీ థియేట్రికల్ రైట్స్ నిర్మాత, నటి అయిన మంచు లక్ష్మి దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆమె భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది.

    సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళనాడులోనే పాపులర్ కాదు...ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ ఇదివరకు నటించని 'రోబో' చిత్రం తెలుగులో విడుదలై సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. తాజాగా రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది.

    Lakshmi Manchu bagged Vikram Simha AP rights

    'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె రజనీకాంత్ ప్రియురాలి పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ నటులు శరత్ కుమార్, ఆది, శోభన, జాకీ ష్రాఫ్, నాసర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విక్రమ సింహా చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రంలో ఏరో 3డి సౌండ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వనుంది.

    ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ పని చేస్తున్నారు. విక్రమ సింహ చిత్రాన్ని మోషన్ పిక్చర్ టెక్నాలజీతో 3డిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలోని విఎఫ్ఎక్స్ వర్క్......ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. అవతార్ చిత్రానికి పని చేసిన స్టీరియోగ్రాఫిక్ టీం 'కొచ్చాడయాన్' చిత్రానికి పని చేసారు.

    English summary
    
 Here is the latest buzz in the tinsel town that anchor cum actress and politician Lakshmi Manchu has bought the theatrical rights of the dubbing version of Rajnikanth starrer Vikram Simha for the entire AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X