For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' ని సమర్ధిస్తూ మంచు లక్ష్మి ప్రసన్న?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అన్ని చోట్ల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న చిత్రం 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం'. ఈ చిత్రంపై సిని ప్రముఖులు ఎవరూ కామెంట్ చేయటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మి కామెంట్ అంటూ ఓ వార్త నెట్ లో హల్ చెల్ చేస్తోంది. ఆ వార్తలో...ఆమె 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' ప్రోమోలో తప్పు లేదని చెప్పినట్లుగా ఉంది. మరో ప్రక్క 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' సినిమాను తక్షణం రద్దు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి.

  ఇక లక్ష్మి ప్రసన్న వ్యాఖ్య ఏమిటంటే... 'ఫోర్నో గ్రపీ అనేది యూనివర్శిల్ గా ఏక్సెప్టెడ్ సబ్జెక్టు,అంతేకాదు కొన్ని సర్వేలు ప్రపంచంలో ప్రతీ రెండో వ్యక్తి ప్రపంచంలో ఇలాంటివి చూడటానికి ఇష్టపడతారని తేల్చాయి. అలాంటప్పుడు ఈ చిత్రంలో ఏమి తప్పు ఉందో అర్దం కావటం లేదు. మన దేశంలో సన్ని లియోన్ వంటి ఫోర్న్ స్టార్స్ ని మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్స్ గా ఏక్సెప్ట్ చేసినప్పుడు,అలాంటప్పుడు ఈ సినిమాను ఎందుకు విరుచుకుపడటం. మనమంతా అడ్వాన్సెడ్ వరల్డ్ లో ఉన్నాం. ఇలాంటి ఆలోచనా ధోరణి మారాలి ', అన్నారు.

  కృష్ణా జిల్లా అర్చక పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘంటసాల పద్మనాభశర్మ మాట్లాడుతూ ప్రభుత్వం 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' సినిమాపై తగిన నిర్ణయం తీసుకోకుంటే జిల్లా అంతటా అన్ని దేవాలయాల్లో ఒక రోజు ధూపదీప నైవేద్యాలు, అర్చనలు నిలిపివేస్తామన్నారు. బ్రాహ్మణ యువజన సంఘం జిల్లా శాఖ, జిల్లా అర్చక పరిషత్‌, ఇతర బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన రిలే దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం ప్రకటించాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్‌ పేర్ని నాని బ్రాహ్మణ సంఘాల నిరసనకు మద్దతు పలికారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విలువలను మంట కలుపుతూ సినిమాలు తీయడం సహేతుకం కాదన్నారు. ఈవిషయంపై సెన్సార్‌ బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఈ సినిమా ప్రదర్శించకుండా తగు చర్యలు చేపడతామన్నారు.

  ఇదిలా ఉంటే...మంచు లక్ష్మి సోదరుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రం పై కూడా వివాదం చెలరేగుతోంది. 'దేనికైనా రెడీ' దసరా పండుగ రోజు విడుదలైంది. హన్సిక హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం బ్రాహ్మణ కుల ఆగ్రహానికి గురైంది. వారు ఈ చిత్రంలో బ్రాహ్మణ వ్యతిరేక సన్నివేసాలు తొలిగించాలంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ఇక 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే పాత్రలను వెంటనే తొలగించాలని, రాష్ట్రంలోని బ్రాహ్మణులకు మంచు విష్ణు, మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి శిరిపురపు వెంకట శ్రీధర్ గుంటూరు లో డిమాండ్ చేశారు.

  English summary
  Sharing her thoughts about 'A Woman in Brahmanism' movie, Lakshmi Manchu stated that she felt nothing wrong with the movie promos. 'Pornography is an universally accepted subject and surveys say that every second person in this world loves watching it. So what is wrong with that movie', asks Lakshmi. She felt that when India can accept porn-stars like Sunny Leone as mainstream heroines, why they cannot take this movie. 'We are in an advanced world and people should stop thinking irrationally', she advised.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more