»   » మంచు లక్ష్మి ‘దొంగాట’ ఫస్ట్ లుక్ ఇదే..

మంచు లక్ష్మి ‘దొంగాట’ ఫస్ట్ లుక్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. దొంగాట సినిమా టీజర్‌ను ఉగాదికి, సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేసేందుకు నిర్మాత మంచు లక్ష్మి సన్నాహాలు చేస్తున్నారు.

Lakshmi Manchu in Dongata Movie First Look

కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం. ఇటీవలే ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు.

English summary
Here is the most vibrant and lively first look poster of Lakshmi Manchu starrer 'Dongaata'. Interestingly, This Multi-Talented Beauty's Baby Girl Vidya Nirvana is presenting this movie. Needless to say, Manchu Girl is looking gorgeous here! This poster is just a celebration of Women Power!
Please Wait while comments are loading...