»   » ముఖ్యమంత్రి చేతుల్లో మంచు లక్ష్మి కుమార్తె(ఫొటో)

ముఖ్యమంత్రి చేతుల్లో మంచు లక్ష్మి కుమార్తె(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న మార్చి 4 న పార్క్ హయిత్ లో మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్ జరగిన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు విచ్చేసారు. ఆయన అక్కడ ఉన్న మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ను ఎత్తుకుని ముద్దు చేసారు. ఈ ఫొటోని అక్కడ చాలా మంది క్లిక్ మనిపించారు. ఇక్కడ ఆ ఫొటో చూడండి. ఎంత క్యూట్ గా ఉందో పాప కదూ...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మంచు లక్ష్మి చిత్రాల విషయానికి వస్తే...

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Lakshmi Manchu's daughter with Chandara Babu

కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

English summary
This particular picture featuring Andhra Pradesh Chief Minister Chandrababu Naidu remains to be special for Manchus from the countless snaps taken at the grand engagement ceremony of Manchu Manoj event.
Please Wait while comments are loading...