twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్య, జూ ఎన్టీఆర్‌పై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్!

    నందమూరి బాలకృష్ణ తన తండ్రి, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్యే నటించబోతున్నారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన తండ్రి, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్యే నటించబోతున్నారు.

    అయితే ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యే వరకు మాత్రమే ఉంటుందని, ఎన్టీఆర్ చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద, దారుణ సంఘటనలను ఇందులో చూపించే అవకాశం లేదని అంటున్నారు.

    అవి చూపిస్తే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, బాలయ్యకు స్వయానా బావు, వీయంకుడు అయిన చంద్రబాబుకు అనవసర చిక్కులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు మాత్రమే ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాపై, బయట జరుగుతున్న ప్రచారంపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

     అలా తీస్తే దాన్ని ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని పేరు పెట్టడం ఎందుకు?

    అలా తీస్తే దాన్ని ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని పేరు పెట్టడం ఎందుకు?

    ఎన్టీఆర్ జీవితం మొత్తం చూపించనపుడు, ప్రజలకు చెప్పాల్సిన అసలు నిజాలను సినిమాలో చూపించనపుడు దానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని పెట్టడం అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా సినిమాలో చూపించాలని అన్నారు.

     నేను విలన్ కాదు, నిజానికి దేవతను

    నేను విలన్ కాదు, నిజానికి దేవతను

    సినిమాలో మిమ్మల్ని విలన్ గా చూపించే అవకాశం ఉందా? అనే పశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ.... నేను విలన్ ఎప్పటికీ కాదు, నిజానికి నేను ఎన్టీఆర్ జీవితంలో దేవతను అని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

     నన్న బూచిగా చూపారు

    నన్న బూచిగా చూపారు

    చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కలిసి చేసిన కుట్రలో నన్ను బూచిగా చూపారు. జరిగినటువంటి చరిత్రను పక్కదారి పట్టించారు. మహానుభావుడిని అధ్యక్షపదవి నుండి తొలగించారు అని లక్ష్మి పార్వతి అన్నారు.

     వక్రీకరించినట్లే

    వక్రీకరించినట్లే

    ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎదుర్కొన్న సంఘటనలు, ఆయన పదవిని లాక్కున్న సంఘటనలు చూపించాలి. జరిగినవి జరిగినట్లుగా చూపించక పోతే.. బాలయ్య ఎన్టీఆర్ జీవిత చరిత్రను వక్రీకరించినట్లే అని లక్ష్మీ పార్వతి అభిప్రాయ పడ్డారు.

     తండ్రిని చంపుకున్నారు

    తండ్రిని చంపుకున్నారు

    చంద్రబాబు చేసిన కుట్రలో నందమూరి వారసులు తండ్రిని పోగొట్టుకున్నారు. ఇపుడు పదవి కోసం రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? అని లక్ష్మి పార్వతి అన్నారు.

     జూనియర్ ఎన్టీఆర్ చేసిన మేలు మచిచాడు, అహంకారే

    జూనియర్ ఎన్టీఆర్ చేసిన మేలు మచిచాడు, అహంకారే

    జూఎన్టీఆర్, వాళ్ల అమ్మని కుటుంబం వెలేస్తే నేనే పిలిపించాను. అప్పటి నుండి ప్రతి రోజు స్కూలు నుండి రాగానే ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చేవాడు. కానీ చేసిన మేలు మరిచాడు. అందుకే అతన్ని అహంకారి అన్నాను... అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

     ‘అర'జాన బాహుడు: జూనియర్‌పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

    ‘అర'జాన బాహుడు: జూనియర్‌పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

     క్లిక్ చేయండి. క్లిక్ చేయండి.

    English summary
    Lakshmi Parvathi said that if the actual biography is taken as film she will have no qualms and added that if the makers try to skew the facts and try to depict her as a villain or if the backstabbing story is skewed she will seek court's help.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X