»   » ఎన్టీఆర్ మీద చెప్పులేశారు, బాలయ్య కూడా కుట్రదారుడే: వర్మ బయోపిక్‌పై లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ మీద చెప్పులేశారు, బాలయ్య కూడా కుట్రదారుడే: వర్మ బయోపిక్‌పై లక్ష్మీ పార్వతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమని లక్ష్మి పార్వతి స్పందించారు. ఎన్టీఆర్ మీద సినిమా తీయాలని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ వాస్తవాలు తీయాలని, నిజాలను నిర్భయంగా చెప్పాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.

  రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సల్. ఆయనంటేనే ఓ వివాదం. ఎప్పుడో మరిచిపోయినటువంటి పాత పగలను గుర్తు చేయడం...అనేది ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాల మీద ప్రజల అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

  బాలకృష్ణతో తీస్తే న్యాయం జరుగదు

  బాలకృష్ణతో తీస్తే న్యాయం జరుగదు

  వర్మ సినిమాలో బాలకృష్ణ హీరో అనే మాట వినపడుతోంది. అది ఎందుకొచ్చిందో నాకూ తెలియదు. బాలకృష్ణను పెడితే పిక్చర్ కు న్యాయం జరుగదు. ఆయన తీయాలనుకున్న వివాదాస్పద అంశాల్లో బాలకృష్ణ కూడా ఒకరు... అని లక్ష్మి పార్వతి అన్నారు.

  ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు

  ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు

  ఆ రోజు వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి సపోర్టు చేశారు. మరి బాలకృష్ణ వర్మ సినిమాలో ఉంటే నిజాన్ని నిర్భయంగా వర్మ చూపించగలరా? అని లక్ష్మి పార్వతి ప్రశ్నించారు.

  చెప్పులేసిన సంఘటన కూడా చూపాలి

  చెప్పులేసిన సంఘటన కూడా చూపాలి

  వివాదమైన సంఘటనలు ఉంటాయని వర్మ చెబుతున్నారు కనుక.... వైస్రాయ్ హోటల్ లో ఆయనపై చెప్పులేసిన సంఘటన, అల్లుడు తనకు చేసిన అన్యాయం మీద మాట్లాడిన మాటలు, జెమినీ టీవీలో ఆయన ఇచ్చిన ధర్మపీఠం ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ప్రత్యేక సాక్ష్యాలే. ఇవన్నీ చూపాలి.

  అవి చూపిస్తే చంద్రబాబు, బాలయ్య ఊరుకుంటారా?

  అవి చూపిస్తే చంద్రబాబు, బాలయ్య ఊరుకుంటారా?

  ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలన్నింటినీ కూడా వర్మ చెప్పగలరా? అలా చెబితే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? అసలు ముందు బాలకృష్ణ ఊరుకుంటారా? ఇన్నీ కాకుండా వాళ్లకు అనుకూలంగా చెబితే నేను ఊరుకుంటానా? అని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు.

  ఆయన చెప్పిందే పుస్తకంలో రాశాను

  ఆయన చెప్పిందే పుస్తకంలో రాశాను

  ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నుండి చీత్కారాలు ఎదురయ్యాయని నేనెప్పుడూ అనలేదు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన నన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని నేను రాసిన పుస్తకంలో రాశాను. ఆ మాట కూడా నాది కాదు... స్వయంగా ఎన్టీఆర్ గారు ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం చెప్పారు. నన్ను చూసుకోవడానికి వివాహం అవసరం అయింది. అందుకే నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను. నా చేయి, కాలు సరిగా పని చేయదు. నేను అన్నం తినలేను అని స్వయంగా ఆయన చెప్పిన మాటలే ఆ పుస్తకంలో రాశాను... అని లక్ష్మి పార్వతి తెలిపారు.

  బాలయ్యను పెడితే న్యాయం జరుగదు

  బాలయ్యను పెడితే న్యాయం జరుగదు

  నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపి సింగ్ లాంటి వారిని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికే దక్కింది. కాబట్టి చరిత్రను గొప్పగా చూపిస్తే అది వేరు. కానీ చివర్లో ఆయన పదవి లాగేసినటువంటి వైనాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించగలిగే ధైర్యం అయితే రామ్ గోపాల్ వర్మకు ఉందో లేదో తెలియదు కానీ.... బాలకృష్ణ పేరు బయటకు వస్తోంది కాబట్టి ఆయన్ను
  హీరోగా పెడితే ఈ సినిమాకు న్యాయం జరుగదు అని నేను అనుకుంటున్నాను... అని లక్ష్మి పార్వతి అన్నారు.

  వివాదాల జోలికి వద్దని బాలయ్యకు చెప్పాను

  వివాదాల జోలికి వద్దని బాలయ్యకు చెప్పాను

  బాలకృష్ణ సినిమా తీస్తానని ప్రకటించినపుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. మీ నాన్న గారు సాధించిన గొప్పతనం, విజయాలు అందరికీ కూడా ఆదర్శవంతం అవుతాయని చెప్పాను. నువ్వు వివాదాల జోలికి వెళ్లావంటే నీ బావకు నీవు సపోర్టు చేయాల్సి వస్తుంది. నీ బావను సపోర్టు చేస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగదు. ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాటలు పూర్వ పక్షం చేసినట్లు అవుతుంది. కనుక ఇది కరెక్ట్ కాదు...అటువంటి వివాదాల జోలికి పోకుండా నువ్వు తీసుకో సినిమా అని చెప్పాను అని లక్ష్మి పార్వతి అన్నారు.

  English summary
  Lakshmi Parvathi Response On RGV NTR's Biopic. It was very difficult to feature the facts and truths that happened in the life of Sr.NTR in this biopic as it was related to TDP leaders so they had to face the criticism.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more