»   » ‘అర’జాన బాహుడు: జూనియర్‌పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

‘అర’జాన బాహుడు: జూనియర్‌పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో తాత పోలిక అనే పేరుంది. నటనలో, అందంలో తాతయ్య ఎన్టీఆర్ లక్షణాలు పునికి పుచ్చుకున్నాడని అంటుంటారంతా. ఈతరం హీరోల్లో నందమూరి వంశంలో మంచి ఫాంలో ఉన్న స్టార్ కూడా జూ ఎన్టీఆరే.

అయితే జూ ఎన్టీఆర్ ను తాతయ్యతో పోల్చడం ఏ మాత్రం సబబు కాదు అంటున్నారు.... స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. అంతే కాదు పోలికల విషయంలో జూ ఎన్టీఆర్ మీద ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంత వరకు ఎవరూ కూడా జూ ఎన్టీఆర్ మీద ఇలాంటి కామెంట్స్ చేయలేదు.

Lakshmi Parvathi

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.....'ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి పోలికా... ఇద్దరినీ పక్కపక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇద్దరికీ హస్తిమశకాంతరం. ఆయన ఆజాను బాహుడైతే ఈ అబ్బాయి అరజాన బాహుడు. ఆయన అందమైన రూపం ఎవరికీ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ కే కాదు, ఆయన కుటుంబంలో కూడా.. ఎన్టీఆర్ గారికి నటనలో గానీ, రూపంలో గానీ ఎవరూ సాటిరారు. ఆయనకు వారసులనేవారే లేరు.' అంటూ వ్యాఖ్యానించారు.

అయితే లక్ష్మీ పార్వతి మరీ ఇంత దారుణంగా కామెంట్స్ చేయడంపై విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నటనలో, అందంలో ఆయనకు వారసులనే వారే లేరు అనడం సబబు కాదు అంటున్నారు. బాలయ్య, జూ ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకెలుతుంటే ఆమెకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

English summary
Late NTR wife Lakshmi Parvathi shocking comments on Tollywood star Jr NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X