»   » పవన్ సినిమా టైటిల్ కుక్కకు, హీరోయిన్‌పై ఫ్యాన్స్ ఫైర్ (ఫోటోస్)

పవన్ సినిమా టైటిల్ కుక్కకు, హీరోయిన్‌పై ఫ్యాన్స్ ఫైర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కినప్పటి నుండి సౌత్ హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. ట్విట్టర్లో ఏదో ఒక పోస్టు చేస్తూ హడావుడి చేస్తోంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తున్న రాయ్ లక్ష్మి ఇటీవల పవన్ కళ్యాణ్‌ సెట్స్‌లో దిగిన ఫోటోలు పోస్టు చేసి పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేయడంతో ఆయన ఫ్యాన్స్ దృష్టంతా రాయ్ లక్ష్మి వైపు మళ్లింది. ట్విట్టర్లో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తలు గుప్పించడం ప్రారంభించారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

అయితే ఈ ఆనందం ఆమెకు ఎంతో సేపు నిలవలేదు. ఓ చేసిన ఓ ట్విట్టర్ పోస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహానికి కారణమైంది. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో ఆమెకు చిన్న కుక్క పిల్ల దొరికింది. అది ఎంతో క్యూట్ గా, ముద్దుగా ఉండటంతో దాన్ని చేరదీసింది. దానికి ‘గబ్బర్' అనే పేరు పెట్టింది. పోయి పోయి కుక్క పిల్లకు తమ హీరో సినిమా టైటిల్ పెట్టడంతో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

రాయ్ లక్ష్మి ట్వీట్


గబ్బర్ సింగ్ సెట్స్‌లో తనకు దొరికిన కుక్క పిల్లతో రాయ్ లక్ష్మి. ఏ పేరు పెట్టాలని అభిమానులను అడిగింది.

గబ్బర్ అంటూ..


ఫైనల్ గా ఈ కుక్క పిల్లకు గబ్బర్ అంటూ పేరు పెట్టినట్లు రాయ్ లక్ష్మి వెల్లడించింది.

సెల్ఫీ


పవన్ కళ్యాణ్ తో కలిసి లక్ష్మీరాయ్ సెల్పీ

ఐటం సాంగ్ కాదు..


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో తాను చేస్తున్నది ఐటం సాంగ్ కాదని, ఇదొక ఇన్స్‌స్పిరేషనల్ సాంగ్ అంటోంది లక్ష్మీ రాయ్.

పవన్ కళ్యాణ్‌తో


పవన్ కళ్యాణ్ తో లక్ష్మీరాయ్

English summary
Lakshmi Rai is all over the tabloids ever since she announced her team up with Power Star Pawan Kalyan, in Sardaar Gabbar Singh. The long legged lass will be seen shaking a leg with the star in couple of songs and is also reportedly playing an important role in the film.
Please Wait while comments are loading...