»   » హీరోయిన్ రాశి గుర్తుందా?...అందరినీ భయపెడుతూ ‘లంక’లో!

హీరోయిన్ రాశి గుర్తుందా?...అందరినీ భయపెడుతూ ‘లంక’లో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన రాశి గుర్తుందా? కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన రాశి ఈ మధ్య మళ్లీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో దర్శనమిస్తోంది. త్వరలో ఆమె అందరీ భయపెట్టే కాన్సెప్టుతో వస్తోంది.

'లంక' పేరుతో తెరకెక్కుతున్న హారర్ సినిమాలో రాశి లీడ్ రోల్‌ చేస్తోంది. శ్రీముని డైరెక్ట్ చేసిన చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. చిత్ర దర్శకుడు శ్రీముణి మాట్లాడుతూ.. "శివరాత్రి సందర్భంగా "లంక" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాం. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం" అన్నారు.

'LANKA' movie first look poster

సరికొత్త కాన్సెప్టుతో 'లంక' సినిమా తెరకెక్కుతోందని, చంద్రముఖి సినిమాలో జ్యోతికకు ఎంత మంచి పేరొచ్చిందో.. 'లంక' సినిమాలో రాశికి కూడా అంతే పేరొస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!

English summary
Yesteryear glamorous and talented heroine Raasi is coming back into the centre of Telugu cinema with her maiden venture LANKA directed by Sri Muni. On the eventual Shiva Rathri festive occasion, makers have released the first look poster for media and public viewing. LANKA is produced by Namana Dinesh and Namana Vishnu Kumar on Rolling Rocks Entertainments banner presented by Namanam Sankara Rao and Sundari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu