»   » ప్రముఖ నటి పడక గది కోసం కొట్లాట.. వారెవరో తెలుసా..

ప్రముఖ నటి పడక గది కోసం కొట్లాట.. వారెవరో తెలుసా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్రాల్లో తల్లి పాత్రలో విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న విలక్షణ నటి, దివంగత నిరూప రాయ్ ఇళ్లు వివాదంలో కూరుకుపోయింది. ముంబైలోని నేసియన్ సీ రోడ్డులో ఆమెకు విశాలమైన విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. దాని విలువ సుమారు వంద కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఆ ఇళ్లు తమకే దక్కాలని ఆమె కొడుకులిద్దరూ కొట్లాటకు దిగారు. వివాదంగా మారిని ఆ ఫ్లాట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

విలాసవంతమైన ఫ్లాట్ మా సెంటిమెంట్

విలాసవంతమైన ఫ్లాట్ మా సెంటిమెంట్

నిరూప రాయ్ ఇంటిలోని బెడ్రూం కోసం ఆమె కుమారులిద్దరు కిరణ్ (45), యోగేశ్ (57) కోట్లాడుతున్నారు. ఆ పడక గదితో తమకు మరచిపోలేనటువంటి అనుబంధం ఉందని, అది మాకు సెంటిమెంట్ విషయం అని వారిద్దరూ పేర్కొంటున్నారు.

ఫ్లాట్‌పై ఇద్దరికి సమాన హక్కులు

ఫ్లాట్‌పై ఇద్దరికి సమాన హక్కులు

ఎంబసీ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇంటి వైశాల్యం 3 వేల చదరపు అడుగులు. గార్డెన్ విస్తీర్ణం 8 వేల చదరపు అడుగులు. ప్రస్తుతం నిరుపమ రాయ్‌కి సంబంధించిన బెడ్రూంను కిరణ్ ఉపయోగించుకొంటున్నాడు. ఆ ఇంటిపై ఇద్దరు కొడుకులకు సమాన హక్కులు ఉన్నాయి.

సోదరుడిపై తమ్ముడి కేసు నమోదు

సోదరుడిపై తమ్ముడి కేసు నమోదు

తల్లి బెడ్రూం విషయంలో వివాదం తలెత్తడంతో తన అన్న యోగేశ్‌పై కిరణ్ హైకోర్టులో కేసు నమోదు చేశాడు. ఆ ఇంటిని కబ్జా చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.

చివరి రోజుల్లో నా తల్లిదండ్రులతో గడిపాను

చివరి రోజుల్లో నా తల్లిదండ్రులతో గడిపాను

నా తల్లిదండ్రుల చివరి రోజుల్లో వారితో నేను ఆ ఇంటిలో గడిపాను. నా తల్లిదండ్రులను యోగేశ్, అతడి భార్య చాలా వేధించారు. నా తండ్రి రాసిన విల్లులో ఆ ఫ్లాట్ మొత్తం నాకే చెందాలని రాశారు. కానీ నా అన్నను, అతడి ఫ్యామిలీని ఉండేందుకు అవకాశమిచ్చాను. వారు నా తల్లి బెడ్రూంలోకి వెళ్లకూడదనే షరతుతో అనుమతించాను అని కిరణ్ తెలిపాడు.

ఆ ఇంటిని దుర్వినియోగం..

ఆ ఇంటిని దుర్వినియోగం..

అయితే కిరణ్ ఆరోపణలపై స్పందించడానికి యోగేశ్ అందుబాటులోకి రాలేదని ఓ మీడియా వెల్లడించింది. కాగా తన తమ్ముడు నా తల్లిదండ్రుల బెడ్రూంను దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే తాళాలు ఇవ్వడం లేదని యోగేశ్ ఆరోపించడం గమనార్హం.

English summary
Late actress Nirupa Roy maa in a number of yesteryear Bollywood movies, has her real-life sons embroiled in a dispute over her spacious apartment at Nepean Sea Road (Mumbai), and who are now fighting to take over her bedroom.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu