twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాంప్రమైజ్ : సౌందర్య ఆస్తుల వివాదం ముగిసింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఒకప్పుడు సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హీరోయిన్ సౌందర్య ఎన్నికల ప్రచారానికి వెలుతూ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమరనాథ్ కూడా మరణించారు. అనంతరం సౌందర్య ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది.

    సౌందర్య ఆస్తులు తనకే చెందేలా వీలునామా రాసారంటూ అమర్ నాథ్ భార్య బి. నిర్మల కోర్టు కెక్కారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త జీఎస్ రఘు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మంజుల, రఘు తనపై కక్ష్య సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారంటూ నిర్మల వారిపై పరువు నష్టం దావా కూడా వేసింది. అయితే...కోర్టు వివాదాలు ఉన్నంత కాలం ఆస్తులు చేతికి రావని భావించిన ఇరు వర్గాల కాంప్రమైజ్ అయ్యాయి. పంపకాల విషయంలో రాజీకి రావడంతో పాటు......ఈ మేరకు ఒప్పందం కుర్చుకున్నారు.

    కోర్టులో ఇరు వర్గాలు కేసులు వాపస్ తీసుకున్నారు. దాని ప్రకారం సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, బెంగులూరు హనుమంతనగర్లో ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌(అమరనాథ్ తనయుడు)కు చెందుతాయి. నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య పేరుతో ఉన్న భూమి విక్రయించగా వచ్చిన డబ్బును మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకుంటారు. జాయింట్ ప్రాపర్టీ మొత్తం సౌందర్య తల్లి మంజులకు దక్కుతుంది. ఇక సౌందర్య భర్త రఘుకు... బెంగుళూరు మల్లేశ్వరం, హెచ్ఆర్‌బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌‌లోని కార్యాలయం, హెచ్ఆర్‌బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు చెందుతాయి.

    English summary
    Late actress Soundarya property dispute issues have been solved. The family members have finally put an end to the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X