»   » వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంతవరకూ గ్లామరస్‌ పాత్రల్లోనే మెప్పించిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇప్పుడు తొలిసారిగా ప్రయోగం చేసింది. మురుగదాస్‌ తెరకెక్కించిన 'అకిరా' సినిమాలో కీ రోల్‌ పోషిస్తోంది .
ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడింది సోనాక్షి. ఆ కష్టం అంతా తెరపై ఖచ్చితంగా కనబడుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ఈ సినిమా సోనాక్షికి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అదరగొట్టే యాక్షన్‌ సీన్స్‌లో సోనాక్షి అదరహో అన్పిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది.

బయటైతే కష్టం గానీ సినిమాల్లో అయితే ఏ ఫీట్ అయినా చేసేయొచ్చు..., ఎంత ఎత్తునుంచైనా దూకేయొచ్చు... ఒక వేళ మనకు కుదరకుంటే డూప్ లతో చేయించొచ్చు... ఎటూ గ్రాఫిక్స్ సాయం ఉండనేఉంది బ్లూ మ్యాట్ వేసి లాగించవచ్చు..., ఎంత పెద్ద హీరో అయినా సినిమాలో చేసిన ఫీట్ ని బయట కూడా చేయమంటే కష్టమే.... అదే యాక్షన్ సీన్ లో ఉన్న మాదిరి గా వొళ్ళు వంచాలంటే హీరోకే కాదు ఎవరికైనా కష్టమే.... ఇక ఆ ప్లేస్ లో హీరోయిన్ గనక ఉంటే ఇక చెప్పక్కర లేదు... కానీ సోనాక్షి సిన్హా మాత్రం ఈ విషయంలో అందరికన్నా కాస్త వేరు.

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తాజా 'అకీరా'. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా తెరకెక్కుతోంది. ఎ.ఆర్ మురుగదాస్ దర్శకుడు. ఇందులో సోనాక్షితో పాటు శతృఘ్న సిన్హా, కొంకణా సెన్ శర్మ, ఊర్మిళా మహంతా, అమిత్ సాద్, అనురాగ్ కశ్యప్, మిథున్ చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకోసం సోనాక్షీ ఎంత కష్తపడిందో చూస్తే ఆశ్చర్య పోతారు.. యాఖన్ హీరోల స్థాయిలో ఫైట్లు చేసిన సోనాక్షీ డూప్ కూడా అవసరం లేనంత గా స్టంట్స్ చేయటం లో శిక్షణ తీసుకుంది. ఒక సారి ఈ ఫొటోలూ.., వీడియో చూస్తే సోనాక్షీ ఎంత తపనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందో తెలుస్తుంది.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తాజా ‘అకీరా'. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా తెరకెక్కుతోంది. ఎ.ఆర్ మురుగదాస్ దర్శకుడు.

వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

ఇంతవరకూ గ్లామరస్‌ పాత్రల్లోనే మెప్పించిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇప్పుడు తొలిసారిగా ప్రయోగం చేసింది. మురుగదాస్‌ తెరకెక్కించిన ‘అకిరా' సినిమాలో కీ రోల్‌ పోషిస్తోంది.

 వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

వావ్..! సోనాక్షీ..! అమేజింగ్... హీరోలే నోళ్ళు వెళ్లబెడుతున్నారు (వీడియో)

మౌన గురు: సెప్టెంబర్ 2న 'అకీరా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సోనాక్షి సిన్హా. మౌన గురు అనే ఓ తమిళ్ మూవీకి రీమేక్ గా రూపొందగా.. ఇందులో సోనాక్షి చేసిన ఫైటింగ్స్ చూస్తే మతి పోవాల్సిందే.

స్టంట్స్ ప్రాక్టీస్:

స్టంట్స్ ప్రాక్టీస్:

ట్రైలర్ లోనే అదరగొట్టేసిన ఈ భామ.. అలాంటి ఫైటింగ్స్ కు ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు తెలిసిపోయింది. సోనాక్షి ప్రిపరేషన్ ను.. అకీరా మేకింగ్ ను కలిపి ఓ వీడియో రిలీజ్ చేయగా.. ఇందులో అమ్మడి స్టంట్స్ ప్రాక్టీస్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

కొత్తగా:

కొత్తగా:

కొత్తగా సినిమా చేస్తున్నాం.. కొత్తగా ట్రై చేస్తున్నాం.. ఇలాంటి మాటలు వినడం జనాలకు అలవాటే కానీ.. అలా కొత్తగా చూపించే అలవాటు మూవీ మేకర్స్ ఉండదు.

డెడికేషన్

డెడికేషన్

అకీరా మేకింగ్ ను చూశాక ఎవరైనా సరే ఈ ఒపీనియన్ మార్చేసుకోవాలి. ఒక సినిమా కోసం ఆ రేంజ్ లో కష్టపడిపోయింది.

వీడియో

వీడియో

ఆ వీడియోని ఓ లుక్ వేయండి. అకీరా మేకింగ్ చూశాక.. సోనాక్షి పడ్డ కష్టం చూస్తే.. మురుగదాస్ కీ.., సోనాఖి కీ ఒక హ్యాట్సాఫ్ చెప్పేస్తారు.

గాల్లో ఒక కిక్

గాల్లో ఒక కిక్

ఆమధ్య ఒక ప్రోగ్రాం లో విలేకరులు అడిగిన వెంటనే కాలుని మనిషి కంటే ఎత్తులో లేపి గాల్లో ఒక కిక్ ఇచ్చి చూపించింది.

ఒక మెసేజ్‌ను పాస్‌ చేయబోతున్నాడట

అలాగే మంచి యాక్షన్‌, సెంటిమెంట్‌తో పాటు ఈ సినిమా ద్వారా కూడా ఒక మెసేజ్‌ను పాస్‌ చేయబోతున్నాడట మురుగదాస్‌. ఈ సినిమా సోనాక్షి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌ కానుంది. మురుగదాస్‌ డైరెక్షన్‌, సోనాక్షి యాక్షన్‌ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లనున్నాయి.

English summary
Actress Sonakshi is shown preparing hard for the video, with lessons in boxing and kickboxing. The video also ventures into the risks involved in pulling off the action scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more