»   » బాహుబలి-2: భల్లాలదేవ భార్యగా ఆ హీరోయిన్ ఖరారు?

బాహుబలి-2: భల్లాలదేవ భార్యగా ఆ హీరోయిన్ ఖరారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. త్వరలో ‘బాహుబలి-2' కూడా రాబోతోంది. ప్రస్తుతం షూటింగుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తొలి భాగంలో మహిష్మతి రాజుగా భల్లాలదేవ(రానా), అతని కొడుకు పాత్రలో అడవిశేష్ కనిపించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండో భాగంలో భల్లాలదేవ భార్య పాత్ర కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. ఆ పాత్రకు హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లు సమాచారం.

Lavanya Tripati To Play Rana Daggubati's Wife In Baahubali 2

ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో విజయం అందుకున్న లావణ్య త్రిపాఠి.... బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులో తాను భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉందట. అయితే సినిమాలో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని, ఆ పాత్ర కనిపించేది కూడా తక్కువ సమయమే అని టాక్. అయితే ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ కావడం, రాజమౌళి కోరడంతో ఆమె చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

లావణ్య త్రిపాఠి మంచి హైటు కావడంతో రానా లాంటి భారీ కాయానికి జోడీగా సరిపోతుందని, అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి-2 ప్రీప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్-2పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

English summary
According to the latest reports that are pouring in from the industry sources, Lavanya Tripati grabbed the chance to be a part of ensemble cast of Rajamouli's magnum opus, Baahubali 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu