»   » నిత్యామీనన్, తాప్సీ ఇప్పుడు కాజల్ వంతు

నిత్యామీనన్, తాప్సీ ఇప్పుడు కాజల్ వంతు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాజల్ అగర్వాల్ ఈ సారి భయపెట్టడానికి సిద్దమవుతోంది. అంటే హర్రర్ చిత్రం కమిటయ్యిందన్నమాట. ఆమెకు రెండు కోట్ల రెమ్యునేషన్ ఇచ్చి మరీ లారెన్స్ ఆమెను తన తాజా చిత్రంలో చేయటానికి ఒప్పించినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ముని చిత్రం నాలుగో పార్ట్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. తమిళంలో ఈ చిత్రం టైటిల్ "మొట్టు శివ కెట్టు శివ " అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఇంతకు ముందు లక్షీరాయ్, నిత్యామీనన్, తాప్సీ ముని సీక్వెల్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పదేళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోందామె. దక్షిణాదిలో అగ్రతారగా గుర్తింపు తెచ్చుకొంది కాజల్ అగర్వాల్. ఇప్పుడు నటనను ఆస్వాదిస్తూ మంచి కథలు ఎక్కడొస్తే అక్కడే సినిమాలు చేస్తోంది. నటి కాబట్టి కాజల్‌ సినిమాల గురించే మాట్లాడుతుందనుకొంటే పొరపాటే. ఆమెకి చాలా విషయాలపై మంచి అవగాహన ఉంది. ఏ విషయం గురించైనా మాట్లాడేస్తుంది.

Lawerence gets a top heroine for himself!

కాజల్ మాట్లాడుతూ... ''నటీనటులకు సినిమా సెట్‌ తప్ప మరో లోకం తెలిసే అవకాశం ఉండదు. అయినా అక్కడ్నుంచే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. లేదంటే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది' అంటోంది కాజల్‌.

అదెలా సాధ్యమవుతోందని అడిగితే '' హీరోయిన్ గా ప్రయాణం ప్రారంభించాక ఆరేళ్లపాటు విరామం లేకుండా పనిచేశా. అప్పుడు వెనుదిరిగి చూసుకొంటే బోలెడన్ని విజయాలు కనిపించాయి. వ్యక్తిగతంగా మాత్రం ఏదో కోల్పోతున్నట్టు అనిపించేది. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలు అర్థమయ్యేవి కాదు. అప్పట్నుంచి నా జీవన శైలిని మార్చుకొన్నా. చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించడం అలవాటు చేసుకొన్నా.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేది సినిమా సెట్‌లోనే అయినా అక్కడ్నుంచే సమాజాన్ని చదవడం అలవాటు చేసుకొన్నా. తెలియని విషయాల గురించి తోటి నటీనటుల్ని అడిగి తెలుసుకుంటా. రాజకీయాలా, మరొకటా అని కాకుండా అన్ని విషయాలపైనా అవగాహన పెంచుకొనేందుకు ప్రయత్నిస్తుంటా'' అని చెప్పుకొచ్చింది కాజల్‌.

English summary
Kajal is said to be the leading lady of Lawrence new movie, the 4th sequel of Muni franchisee where we have shared Lawrence look from the film already. The film is titled "Mottu Siva Kettu Siva" in Tamil and Kajal agreed to become the horror lady of this scary sequel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu