twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: తేలని లారెన్స్ వివాదం...బ్యాన్??

    By Srikanya
    |

    హైదరాబాద్: దర్శకుడు లారెన్స్, రెబెల్ నిర్మాతల మధ్య వివాదం ఇంకా ముగియలేదు. నెల రోజుల లోపల రెండున్నర కోట్లు కాంపన్షేషన్ గా కడతానని చెప్పిన లారెన్స్ ఇప్పటివరకూ దాని విషయం తేల్చలేదు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్, డైరక్టర్స్ అశోశియేషన్ మార్చి 15న మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి,ఏం నిర్ణయం తీసుకోవాలి, లారెన్స్ పై ఏం చర్య తీసుకోవాలి అనే విషయమై చర్చించనున్నాయి. మరో ఛాన్స్ ఇచ్చి లారెన్స్ పై బ్యాన్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది.

    ఆ సినిమాను రూ.22.5 కోట్లు వ్యయంతో రూపొందిస్తానని నిర్మాతలు భగవాన్‌, పుల్లారావులతో దర్శకుడు ఒప్పందం చేసుకొన్నారు. నిర్మాణ వ్యయం పెరిగింది. ఫలితంగా నిర్మాతలకు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందనీ ఆ మొత్తాన్ని లారెన్స్‌ నుంచి ఇప్పించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించారు. భగవాన్‌, పుల్లారావు. దీనిపై మండలి... దర్శకుల సంఘంతో కలిసి సమన్వయ కమిటినీ ఏర్పాటు చేసి చర్చలు సాగించింది. లారెన్స్‌ రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.

    ప్రభాస్‌ హీరోగా నటించిన 'రెబల్‌' చిత్ర నిర్మాణ వ్యయం అదుపు తప్పడానికి కారణం దర్శకుడు లారెన్స్‌ అని ఆ చిత్ర నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై అప్పట్లో నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ ని మీడియా కలిసింది. ఆయన మాట్లాడుతూ ''మా ముందుకి నిర్మాతల ఫిర్యాదు వచ్చింది. ఖర్చు పెంచడం వల్లే నష్టం వాటిల్లిందని వారు స్పష్టం చేశారు. హిందీ హక్కుల్ని తన ప్రమేయం లేకుండా ఇచ్చేశారని దర్శకుడు అంటున్నారు. దీనిపైన నిర్మాతలూ వివరణ ఇచ్చారు. '' అన్నారు.

    నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి చేసిన ఫిర్యాదులో రూ.22.5 కోట్ల వ్యయంతో రూపొందిస్తానని దర్శకుడు లారెన్స్ ఒప్పంద పత్రం రాశారనీ, అయితే చిత్ర నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.40 కోట్లు ఖర్చయిందనీ వారు తెలిపారు. మరో వైపు లారెన్స్‌ 'రెబల్‌' నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా ఆ చిత్రానికి సంబంధించిన రీమేక్‌, అనువాద హక్కుల్ని నిర్మాతలు అమ్మినట్లు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి రెండుమూడు రోజుల్లో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిసింది.

    English summary
    Dispute between producers J.Bhagavan and Pulla Rao J and director Raghava Lawrence is still going on. When both producers and director approached Film Chamber and directors Association by complaining against each other, they called the parties concerned for settlement. They directed Lawrence to pay compensation of Rs 2.5 crs to the film makers’ long time back but till now Lawrence who promised to pay within one month did not fulfill the undertaking. The Film Chamber and directors association will be meeting on March 15th to decide on the future course of action in the matter. It has to be seen whether Raghava Lawrence will be banned or would be given another chance for patch up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X