»   » దెయ్యం+ గ్లామర్ : లారెన్స్... ‘గంగ’( ప్రివ్యూ )

దెయ్యం+ గ్లామర్ : లారెన్స్... ‘గంగ’( ప్రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా సీక్వెల్స్ వర్కవుట్ అవటం చాలా తక్కువ. అయితే ఆ విషయంలో రాఘవ లారెన్స్‌ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే రెండు సీక్వెల్స్ తో ముని చిత్రాన్ని అందించిన ఆయన మూడో సారి ‘గంగ'(ముని 3) అంటూ ముందుకు వచ్చారు. వారం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్దిక కారణాలతో ఆగిపోయింది. అయితే తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఇక్కడ కూడా అంచనాలు పెరిగాయి. అయితే ఇక్కడ మనవారి అంచనాలను ఈ చిత్రం ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఊరిచివర భయం గొలిపే ఇల్లు, చచ్చిపోయిన అమ్మాయి ఆత్మ ఇంట్లో పగతో తిరుతూండటం ఇవన్నీ రెగ్యరర్ హర్రర్ చిత్రాల థీమ్స్. అయితే గంగ వీటికి భిన్నంగా సాగుంది. ఓ టీవి ఛానెల్ వారు... దెయ్యాలను పట్టుకోవటం...వాటిని మార్కెటింగ్ చేయటం అనే పోగ్రామ్ తో ప్రారంభం అవుతుంది. వాళ్లు ఓ ఇంటిని ఎన్నుకుని అక్కడ కావాలని...ఆర్టిఫిషియల్ దెయ్యాలను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడకి టీవీ క్రూ మొత్తం వెళ్తుంది. అయితే అక్కడ నిజంగా ఆ ఇల్లు దెయ్యాలతో నిండి ఉందని అర్దమవుతుంది. అప్పుడేం జరిగింది...ఈ కథలో రాఘవలారెన్స్ ..టీవి కెమెరామెన్ గా కనిపిస్తాడు. ఇంతకీ గంగ ఎవరు..ఈ ఇంటికీ గంగకు సంభందం ఏమిటి...లారెన్స్ ఏం చేస్తాడు అనేది మిగతా కథ.


Lawrence's Ganga(Muni 3) Movie preview

బెల్లంకొండ సురేశ్‌ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ‘కాంచన' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘గంగ'గా నిర్మించిన ‘ముని 3'ను మే 1న విడుదల చేస్తున్నాం. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ సినిమా. తెలుగులో కూడా సూపర్‌హిట్‌ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రాఘవ లారెన్స్‌ నటన, దర్శకుడిగా ఆయన టేకింగ్‌ తాప్సీ, నిత్యమీనన్‌ల గ్లామర్‌ సినిమాకి ఎసెట్‌ అవుతుంది'' అని అన్నారు.


లారెన్స్ కు రెగ్యులర్ యాక్షన్ సినిమాల కన్నా హర్రర్ కామెడీలో బాగా అచ్చి వచ్చాయి. ఆ జానర్ లో చేసిన 'ముని', 'కాంచన'... లారెన్స్‌ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచి, ఘన విజయం సాధించాయి. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు నవ్వించిన ఈ కథలు.. బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాలకు సీక్వెల్‌గా 'గంగ' వస్తోంది. ఇప్పటికే తమిళంలో హిట్టవటంతో అందరూ హుషారుగా ఈ చిత్రం ఇక్కడ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.


పతాకం: శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌
నటీనటులు:రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌ తదితరులు
ఫోటోగ్రఫీ: కిచ్చా,
సంగీతం: థమన్,
సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్,
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు,
కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
విడుదల తేదీ: మే 1, 2015.

English summary
Scary, funny, thrilling, sentimental Lawrence serves all the summer treat in three hours of packed entertainment. The man that broke the jinx in cinema, bringing in comic horror movie, through 'Muni', is back to the big screen with the next in this genre that he has pioneered. Finally Lawrence master’s “Ganga” (Kanchana 2) is hitting cinemas today, A part from Lawrence’s terrific direction and acts, glamour of Taapsee and Nitya Menon are going to be a big plus.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu