»   » 20 కోట్ల భారీ ఖర్చుతో లారెన్స్ హీరోగా ...

20 కోట్ల భారీ ఖర్చుతో లారెన్స్ హీరోగా ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవ లారెన్స్ హీరోగా, శింబుదేవన్ దర్శకత్వంలో ఎ.జి.ఎస్ ఎంటర్ ‌టైన్‌ మెంట్స్ సంస్థ నిర్మించిన 'సూపర్ కౌబాయ్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నైజాం, ఆంధ్రా ఏరియాల్లో సాయికృష్ణ ప్రొడక్షన్స్ అధినేత డి.ఎస్.రావు పంపిణీ చేస్తున్నారు. ఆయన చిత్రం ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ '20 కోట్ల రూపాయల వ్యయంతో, సరికొత్త బ్యాక్‌ డ్రాప్‌ లో నిర్మించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. 18వ శతాబ్దానికి సంబంధించిన కథను తీసుకుని వినోదభరితంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందని లారెన్స్ నాతో అన్నారు. సాయికుమార్ పోషించిన పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది. సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. ఇంతవరకూ వచ్చిన కౌబాయ్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. 70 ప్రింట్లతో, 100కి పైగా థియేటర్లతో భారీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu