»   » బాలయ్య ‘లెజండ్’ ఎన్నికల్లోపే.. ఆ నాయకులే టార్గెట్?

బాలయ్య ‘లెజండ్’ ఎన్నికల్లోపే.. ఆ నాయకులే టార్గెట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లెజండ్'. ఇటీవల విడుదలైన ఈచిత్రంలోని బాలయ్య ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.

'లెజండ్' చిత్రాన్ని 2014 జనరల్ ఎలక్షన్స్‌ ముందు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట . ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాపుతో ఉంటుందని, ప్రస్తుత రాజకీయాలపై, పలువురు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఈ చిత్రంలో సెటైర్లు ఉంటాయని, త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయనున్న బాలకృష్ణకు ఈచిత్రం మంచి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి బలకృష్ణ ఈ చిత్రంలో ఏయే నాయకులను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఇటీవల నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా...బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో లెజండ్ లుక్ తో రావటం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని, ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. బాలయ్యతో రెండో సినిమా చేయడం ఈ యేడాది స్పెషల్‌. సింహా తరవాత వస్తున్న కాంబినేషన్‌ కాబట్టి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. అందుకు తగ్గట్లుగా సినిమా రూపొందిస్తున్నాం. 'లెజెండ్‌' విడుదలైన రోజు బాలకృష్ణ అభిమానులకే కాదు.. నాకూ పండగే. కొత్త యేడాది అందరికీ బాగుండాలని కోరుకొంటున్నా'' అన్నారు.

English summary
Balakrishna upcoming film 'Legend' is already garnering a lot of curiosity. Directed by Boyapati Srinu, the film’s first look was revealed recently. A close source reveals, The satirical dialogues and the political backdrop reflect the present scenario of Andhra Pradesh,” Like in his earlier film 'Simha', in this film too, Balakrishna has some strong dialogues which are the actor’s forte.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu