»   » నిర్మాత రామానాయుడు మృతి: ట్విట్టర్లో ఎవరేమన్నారు?

నిర్మాత రామానాయుడు మృతి: ట్విట్టర్లో ఎవరేమన్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ చలన చిత్ర నిర్మాత రామానాయుడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈరోజు 3.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. దీంతో అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన మృతికి సంతాపం తెలిపారు. రామానాయుడు వంద చిత్రాలను నిర్మించి ప్రపంచరికార్డు నెలకొల్పారని, చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ తెచ్చేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Legendary Producer Ramanaidu No More: Twitter comments

రామానాయుడు మృతి యావత్‌ సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కన్నుమూశారన్న వార్త తెలిసి షాక్‌కుగురైన పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుంటున్నారు.

భారత సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించిన గొప్ప వ్యక్తి రామానాయుడు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మంచు మనోజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అలాగే ఇతర నటులు సందీప్ కిషన్, శ్రద్ధాదాస్‌లు కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఆయ మృతికి సంతాపం తెలిపారు. 

English summary
Legendary Producer Ramanaidu No More. Some of the Tollywood celebrated tweeted.
Please Wait while comments are loading...