twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలి: రాజమౌళి

By Srikanya

హైదరాబాద్: "రాష్ట్రం సంగతి నాకు తెలియదు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలి. పరస్పరం ద్వేషించుకోవద్దు'' అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజ్ఞప్తి చేశారు. ప్రజలుగా మనల్ని మనం విడగొట్టుకుని, పరస్పరం ద్వేషించుకుంటే మనం మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సీమాంధ్ర పర్యటనపైనా, రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలపైనా ఆయన తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

ఆ ట్వీట్ లో ..."తెలంగాణలో ఉద్యమాలు చెలరేగినప్పుడు జేపీ ఆ ప్రాంతంలో పర్యటించి, సెమినార్లు నిర్వహించారు. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతుండడంతో అక్కడ కూడా అదే పని చేస్తున్నారు. కానీ, ఆయన పర్యటనలు ఉద్యమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయనే అపవాదు ఎదురవడం శోచనీయం. నిజానికి ఆయన ప్రజలనందర్నీ కలపాలనీ, సమస్యల్ని చర్చించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉండటం న్యాయమే! కానీ, పరిష్కారం కనుగొనాలంటే ప్రజలు ఒకచోటికి రావాలి. చర్చించాలి. ఇదే విషయాన్ని జేపీ పదే పదే చెబుతున్నారు.

JP toured and conducted seminars in telengana when agitations were going on here.He’s doing d same bcos the agitations r now happening there
— rajamouli ss (@ssrajamouli) September 15, 2013

It is sad his tour is being ‘dubbed’ as against the agitations when he’s actually trying to bring people together to discuss the problems.
— rajamouli ss (@ssrajamouli) September 15, 2013

He time and again reiterated that the anger and angst if the people is justified. But to find the solution people have to get together, hold
— rajamouli ss (@ssrajamouli) September 15, 2013

ఒకరిని మరొకరు ద్వేషించుకోవడం వల్ల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. అయితే, ఇరు ప్రాంతాల ప్రజల్ని ఒకచోటకు చేర్చడం చెప్పినంత సులువు కాకపోవచ్చు. కానీ, దాని కోసం ఎవరో ఒకరు ప్రయత్నించాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది'' అని రాజమౌళి వ్యాఖ్యానించారు. పార్టీలు రాజకీయం చేద్దామని చూస్తున్నాయని, చానళ్లు రేటింగ్స్ చూసుకుంటున్నాయని చెప్పడం బాధాకరమే అయినా వాటిలో నిజం ఉందని పేర్కొన్నారు.

"నిజం చెబుతున్నా, రాష్ట్రం విడిపోతే, లేదా కలిసి ఉంటే ఏం జరుగుతుందనే దానిపై నాకంత అవగాహన లేదు. కేంద్రం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తుందా, లేదంటే సార్వత్రిక ఎన్నికల దాకా ఆ అంశాన్ని వాయిదా వేస్తుందా అనేది కూడా నాకు తెలియదు. కానీ, తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా'' అని రాజమౌళి ట్వీట్ చేశారు.

English summary
Rajamouli tweeted: "JP toured and conducted seminars in telengana when agitations were going on here.He’s doing d same bcos the agitations r now happening there It is sad his tour is being ‘dubbed’ as against the agitations when he’s actually trying to bring people together to discuss the problems.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X