»   » కొట్టొదింక చీచీ చీలు..... నితిన్ ‘లై’ మూవీ వీడియో సాంగ్

కొట్టొదింక చీచీ చీలు..... నితిన్ ‘లై’ మూవీ వీడియో సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి).

ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'బింబాట్' సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'మిస్ యూ సన్ షైన్' అనే సాంగ్ 1 మినిట్ వీడియో రిలీజ్ చేశారు. సాంగ్ పిక్చరైజేషన్ చూస్తుంటే సినిమా చాలా రిచ్‌గా తీశారని స్పష్టమవుతోంది.


సాంగ్ అదుర్స్

‘మిస్ యూ సన్ షైన్' అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. న్యూ హీరోయిన్ కావడంతో సినిమా ప్రెష్ లుక్ తో కనిపిస్తోంది.


విదేశాల్లో షూటింగ్

విదేశాల్లో షూటింగ్

ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో జరిగింది. వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నఈ చిత్రం ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


హను రాఘవపూడి

హను రాఘవపూడి

కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందిని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.


తారాగణం, నటీనటులు

తారాగణం, నటీనటులు

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.English summary
Here is Miss Sunshine 1Min Video Song of Nithiin's Upcoming Movie #LIE . A 14 Reels Entertainment Production, the film is directed by Hanu Raghavapudi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu