»   » పాపం నితిన్, ఖర్చు పెట్టింది 32కోట్లు: పది కోట్లు కూడా రాలేదు

పాపం నితిన్, ఖర్చు పెట్టింది 32కోట్లు: పది కోట్లు కూడా రాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nithin "LIE" Collected Just Close To Rs 10 Cr

లవర్ బోయ్ నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా లై. ఆగష్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. స్టైలిష్ మేకింగ్ తో యూఎస్ అందాలను చూపించినా కథలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు.

‘లై'

‘లై'

మంచి అంచనాలతోనే వచ్చినా ఆశించిన స్థాయిలో నిలబడలేక "లై" నిరాశ పరచింది.14 రీల్స్ నిర్మించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా పరిచయమైంది. నితిన్ రేంజి పెరిగిపోయిందనుకుని ‘లై' మీద భారీగా ఖర్చు పెట్టేశారు. ఏకంగా రూ.32 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిందీ సినిమా. సినిమాకు ఎంత మేరకు అవసరం అన్నది పక్కన పెడితే.. 75 రోజుల పాటు యుఎస్‌లోనే ఈ చిత్రాన్ని తీశారు. దీంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు.


అంచనాల్ని అందుకోలేకపోయింది

అంచనాల్ని అందుకోలేకపోయింది

ఐతే విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బడ్జెట్ మొత్తం రికవరైపోతుందనుకున్నారు. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపించిన ‘లై' అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇంకో రెండు సినిమాలతో పోటీ పడి దెబ్బ తింది.


9.45 కోట్ల ఫుల్ రన్ షేర్‌

9.45 కోట్ల ఫుల్ రన్ షేర్‌

ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉన్న ఈ సినిమాకు వసూళ్లు మరీ దారుణంగా వచ్చాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం బడ్జెట్లో మూడో వంతు కూడా వసూలు చేయలేకపోయింది. కేవలం రూ.9.45 కోట్ల ఫుల్ రన్ షేర్‌తో చతికిలబడింది. గ్రాస్ రూ.17 కోట్లు వచ్చింది.


భారీ నష్టాలు

భారీ నష్టాలు

అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. నిర్మాతలకు కూడా పెద్ద పంచే పడింది. ఈ సినిమాకు రూ.25 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందులో సగం కూడా వసూలవ్వలేదు. ఉన్నంతలో నైజాం ఏరియాలో రూ.3.2 కోట్లతో పర్వాలేదనిపించింది ‘లై'.


నామమాత్రంగా వసూళ్లు

నామమాత్రంగా వసూళ్లు

మిగతా అన్ని చోట్లా నామమాత్రంగా వచ్చాయి వసూళ్లు. యుఎస్ ప్రేక్షకులు కూడా దీన్ని తిప్పి కొట్టారు. అక్కడ 2 లక్షల డాలర్లకు కొంచెం ఎక్కువ వసూలు చేసిందీ సినమా. మొత్తానికి ‘లై' ఈ చిత్ర బృందంలో అందరి కెరీర్లకూ పెద్ద దెబ్బే వేసింది.English summary
Lie was made with mammoth budget of Rs 32 Cr and it managed a theatrical business of around Rs 25 Cr. It ended up becoming double disaster as it collected just close to Rs 10 Cr. In its full run, Hanu’s directorial venture 'LIE' grossed Rs 17 crore and earned the a share of Rs 9.45 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu