‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’సెన్సార్ పూర్తి
అమిగోస్ క్రియేషన్స్ పతాకంపెై చంద్రశేఖర్ కమ్ముల- శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించారు. అప్పుడు హ్యాపీడేస్ కాలేజీలో..ఇప్పుడు హ్యాపీడేస్ కాలనీలో! ఇది నా చిన్నతనం లాంటి సినిమా. అమాయకం.. ఆహ్లదం..అందమైన నవ్వు... అనుభూతి....ఇలా ఎన్నిటినో తెరపరిచాను ఈసారి'' అన్నారు శేఖర్ కమ్ముల. ఈ చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల కన్నతల్లి పాత్రలో అమల నటిస్తున్నారు. ''ఆ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైంది. నేను ఒక తల్లిని కావటంతో ఆ పాత్ర నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. కొద్దిసేపు మాత్రమే కనిపించే మంచి పాత్రలో నటించటం బాగుంది'' అని అమల తెలిపారు.
సుదీర్ఘ కాలం తర్వాత కెమెరా ముందుకు రావటం గురించి ఆమె మాట్లాడుతూ ''సాంకేతికపరంగా సినీరంగం ఎంతో ఎదిగింది. దాంతో అంతా వైవిధ్యంగా కనిపించింది. అప్పట్లో మేం ఒక సన్నివేశంలో ఎలా నటించింది చూసుకోవటానికి నెల రోజులు పట్టేది. కానీ నేటి సాంకేతిక పరిజ్ఞానం వెంటనే చూసుకోవటానికి అవకాశం ఇస్తున్నది. అంతేకాక నటీనటుల నుంచి ఏం కావాలో దాన్ని చక్కగా రాబట్టే శేఖర్ దర్శకత్వంలో నటించటం గొప్ప అనుభవం'' అని ఆమె నవ్వుతూ చెప్పారు.
''దర్శకుడు శేఖర్ కమ్ముల నన్ను సంప్రదించినప్పుడు మొదట అంగీకరించలేదు. చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు రావటంపై ఒకింత సందేహించాను. కానీ శేఖర్ నాకు నచ్చచెప్పటంతో నటించటానికి ఒప్పుకున్నాను'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












