For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  25 ఏళ్ల తర్వాత పవన్-త్రివిక్రమ్ మూవీతో నిన్నటితరం అందాల తార రీ ఎంట్రీ!

  By Bojja Kumar
  |

  90వ దశకంలో సౌత్ సినిమా పరిశ్రమలో అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న తార లిజీ లక్ష్మి. కేరళకు చెందిన లిలీ 80కిపైగా మలయాళం చిత్రాల్లో పదుల సంఖ్యలో తెలుగు, తమిళం చిత్రాల్లో నటించారు. తెలుగులో సాక్షి, మగాడు, దోషి నిర్దోషి, 20వ శతాబ్దం, మామాశ్రీ, ఆత్మబంధం, శివ శక్తి చిత్రాల్లో నటించారు.

  ఆమె తెలుగులోు సుమన్ తో చేసిన 'ఆత్మబంధం' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. హీరోయిన్‌గా ఫాంలో ఉన్నపుడే ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను పెళ్లాడిన లిజీ తర్వాత నటనకు దూరం అయ్యారు. అయితే దాదాపు 25 సంవత్సరాల తర్వాత లిజీ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

   అఫీషియల్‌గా వెల్లడించిన లిజీ

  అఫీషియల్‌గా వెల్లడించిన లిజీ

  దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత తాను తెలుగు సినిమా ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని, ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్నారని లిజీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

   ఆ సినిమా ఇదే

  ఆ సినిమా ఇదే

  లీజీ రీ ఎంట్రీ ఇస్తున్న మూవీలో నితిన్-మేఘ జంటగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా పికె క్రియేటివ్ వర్క్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తాను కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు లిజీ తెలిపారు.

   సంవత్సరాల తర్వాత కెమెరాముందుకు

  సంవత్సరాల తర్వాత కెమెరాముందుకు

  చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరాముందుకు వచ్చాను. న్యూయార్క్ లో జరుగుతున్న షూటింగులో చాలా గ్యాప్ తర్వాత కెమెరా ముందు నిల్చున్నాను. కాస్త నర్వస్‌గానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఇన్నాళ్లు దీన్ని మిస్సయ్యాను అని లిజీ తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో పూర్తయిందని, సెకండ్ షెడ్యూల్ కూనూర్‌లో అని వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందని అభిమానులకు తెలిపారు.

   తెలుగులో సూపర్ హిట్స్ చేశాను

  తెలుగులో సూపర్ హిట్స్ చేశాను

  నేను అప్పట్లో యాక్టింగ్ వదిలేసే ముందు తెలుగులో 8 సినిమాలు చేశాను. అందులో 6 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో మలయాళం రీమేక్స్ ‘20వ శతాబ్ధం', ‘మగాడు' చిత్రాలు కూడా ఉన్నాయన్నారు.

   అప్పట్లో చాలా బాధ పడ్డాను

  అప్పట్లో చాలా బాధ పడ్డాను

  నిజాయితీగా చెబుతున్నాను... అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని వదిలివెళ్లినందుకు చాలా బాధ పడ్డాను. కానీ అపుడు నాకు వేరేదారి కనిపించలేదు. ఆనాడు నాకు అలాంటి పిరిస్థితులు ఎదురయ్యాయి అని లిజీ తెలిపారు. 22 సంవత్సరాల వయసులోనే తాను నటనను వదిలి పెట్టాను. ఆ సమయంలో నా బ్యాగ్ నిండా అవకాశాలు ఉన్నా.... అన్నింటికీ కాదనుకుని వెళ్లిపోయాను అని లిజీ గుర్తు చేసుకున్నారు.

   మూడేళ్లుగా కథలు వింటున్నాను

  మూడేళ్లుగా కథలు వింటున్నాను

  గత మూడేళ్లుగా నేను మలయాళం, తమిళం, తెలుగులో కథలు వింటున్నాను. ఫైనల్ గా తెలుగు ప్రాజెక్టు ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. సినిమా యూనిట్ సభ్యులు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు అని లిజీ తెలిపారు.

  మలయాళంలో చాలా అవకాశాలు

  మలయాళంలో చాలా అవకాశాలు

  మలయాళంలో నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మలయాళం సినిమా చేస్తాను. నా జీవితంలో నేను సగం జీవితం చెన్నైలోనే గడిపాను. అందుకే నన్ను నేను హాఫ్ తమిలియన్‌గా, హాఫ్ మలయాళీగా చెప్పుకుంటాను.... అని లిజీ తెలిపారు.

  అఖిల్ మూవీ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న లిజీ కూతురు కళ్యాణి

  అఖిల్ మూవీ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న లిజీ కూతురు కళ్యాణి

  అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో' మూవీ ద్వారా లిజీ కూతురు కళ్యాణి హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్లో కళ్యాణ్ లుక్ సూపర్బ్ గా ఉందని, చాలా అందంగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి.

  English summary
  "Many of my Friends and well wishers have been asking me for quite some time whether I will come back to movies. Well!!! I can now confirm that after over 25 years of absence I am acting in a Telugu movie. The movie, yet to be titled is produced by Telugu Star Pavan Kalyan, Ace director Thrivikram Srinivas and Sudhakar Reddy, Directed by Krishna Chaitanya and has Nithiin and Megha in the lead. I am playing a significant character in the movie." Lissy Lakshmi said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more