»   » ‘ధ్రువ’ ఫొటోలు: ఖాకీ డ్రస్ లో చరణ్ , అలాగే చరణ్ కు తెలియకుండా తీసినవి

‘ధ్రువ’ ఫొటోలు: ఖాకీ డ్రస్ లో చరణ్ , అలాగే చరణ్ కు తెలియకుండా తీసినవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ చిత్రం 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం 'ధ్రువ'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ పోలీసుగా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ అంతకు ముందు తుఫాన్ చిత్రంలో పోలీస్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి పోలీస్ గా కనిపించి అలరించనున్నారు. ఆ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అసెస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపిస్తారు. చాలా డాషింగ్ గా ఉన్నాడు ఈ లుక్ లో . ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా కనిపించే నవదీప్ ఈ ఫొటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. చరణ్ సెట్‌లో ఉంటే టీమ్ అందరూ ఎనర్జిటిక్‌గా ఉంటారని..కశ్మీర్‌లో ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తిచేసుకుందని తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా నవదీప్ కీలకపాత్ర పోషిస్తుండగా...విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు.

క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నిన్న (గురువారం) సాయంత్రం హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. ధృవ‌ ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే ఈలోగానే క‌శ్మీర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్ ఒక‌టి ఇంటర్ నెట్ లో హ‌ల్‌చ‌ల్ చేసింది.

రామ్‌చ‌ర‌ణ్ శంషాబాద్ (హైద‌రాబాద్) ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన‌ప్పుడు అభిమానుల కెమెరాకంటికి చిక్కారు... చ‌ర‌ణ్ గతంలో కన్నా స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. ఆ ఫొటోలు ఇక్కడ మీ కోసం

స్లైడ్ షోలో చరణ్ లేటెస్ట్ లుక్..

సిన్సియర్ ఆఫీసర్

సిన్సియర్ ఆఫీసర్

చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు.

లుక్ కోసం ..

లుక్ కోసం ..

పోలీస్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు.

గ్రిప్పింగ్

గ్రిప్పింగ్

చ‌క్క‌ని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో తెర‌కెక్కుతోందని చిత్ర‌యూనిట్ చెబుతోంది.

విడుదల

విడుదల

మొదట ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది.
‘ధ్రువ'ఫొటోలు: ఖాఖీ డ్రస్ లో చరణ్ , అలాగే చరణ్ కు తెలియకుండా తీసినవి

కశ్మీరు లొకేషన్ లో

కశ్మీరు లొకేషన్ లో

సాంగ్ షూట్ సమయంలో లొకేషన్ లో ఓ ఫైన్ మార్నింగ్..

రకుల్ ప్రీతి తో సరదాగా

రకుల్ ప్రీతి తో సరదాగా

సాంగ్ షూటింగ్ సమంయంలో...

సాంగ్ షూటింగ్ సమంయంలో...

ఖాఖీ డ్రస్ లో చరణ్

ఖాఖీ డ్రస్ లో చరణ్

‘ధ్రువ' చిత్రంలో రామ్‌చరణ్‌ పోలీసుగా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ అంతకు ముందు తుఫాన్ చిత్రంలో పోలీస్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి పోలీస్ గా కనిపించి అలరించనున్నారు. ఆ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

కాశ్మీర్ లో ...

కాశ్మీర్ లో ...

ఇక్కడ అద్బుతంగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్ చేయటం మరువలేని అనుభూతి అంటున్నారు రామ్ చరణ్

కీలకమైన సీన్స్

కీలకమైన సీన్స్

ఈ షెడ్యూల్లో చరణ్ - రకుల్ పై ఒక పాటతో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

 నాజర్, పోసాని కీలకమైన

నాజర్, పోసాని కీలకమైన

ఈ సినిమాలో నాజర్ .. పోసాని కృష్ణమురళి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

అదరకొడుతోంది

అదరకొడుతోంది

తమిళంలో 'తని ఒరువన్' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. భారీ వసూళ్లను రాబడుతూ, విజయవిహారం చేసింది.

ఆ నమ్మకంతోనే

ఆ నమ్మకంతోనే

తమిళంలో 'తని ఒరువన్' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. భారీ వసూళ్లను రాబడుతూ, విజయవిహారం చేసింది.

సరికొత్త లుక్

సరికొత్త లుక్

ఓ సరికొత్త లుక్‌తో పోలీసాఫీసర్‌గా రామ్ చరణ్ కనిపించనుండడంతో ఈ సినిమాపై మొదట్నుంచే మంచి అంచనాలున్నాయి.

ఈమధ్యనే...

ఈమధ్యనే...

హైద్రాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్ తాజాగా మరో షెడ్యూల్ కోసం కశ్మీర్ చేరి, షూటింగ్ చేస్తోంది.

పక్కా ప్లానింగ్ తో

పక్కా ప్లానింగ్ తో

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమా పక్కా ప్లాన్ ప్రకారం షూట్ జరుపుకుంటూ, ఆగష్టు నెలాఖరుకు పూర్తవుతుందని సమాచారం.

రిలీజ్ ఎప్పుడంటే...

రిలీజ్ ఎప్పుడంటే...

సెప్టెంబర్ నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పది రోజులు

పది రోజులు

పదిరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారట.

విలన్ భార్యగా

విలన్ భార్యగా

ఈ చిత్రంలో తమిళ సీనియర్ హీరో అరవింద్ స్వామి మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అందుకు ఈ పాత్ర కోసం సూపర్ హాట్ మోడల్ కం బాలీవుడ్ హీరోయిన్ అయిన ఫరా కరిమీని తీసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

English summary
Look at how Ram Charan looks in the Khaki dress with a mustache. In this film Ram Charan plays the role of a tough cop ACP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu