»   » అబ్బా నొప్పి...అయినా భరించిన ఛార్మి (వీడియో)

అబ్బా నొప్పి...అయినా భరించిన ఛార్మి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తను ఇష్టపడితే ఎంతటి నొప్పినైనా భరిస్తాను అంటోంది హీరోయిన్ ఛార్మి. చార్మికి చెవి పోగులు ధరించడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతో మరో చెవి పోగు సెట్ కుట్టించుకుంది. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

C wat I did today luv d pain it's addictive

Posted by Charmme Kaur on Sunday, August 9, 2015

చార్మి సినిమాల విషయానికొస్తే...
చార్మి ఇటీవల నటించిన ‘జ్యోతి లక్ష్మి' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా సినిమా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకు చార్మి కూడా నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఇక గత వారం విడుదలైన చార్మి మరో సినిమా ‘మంత్ర 2' కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

ప్రస్తుతం చార్మి చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేదు. తమిళంలో తెరకెక్కుతున్న హీరో విక్రమ్ మూవీలో ఆమె స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. చార్మికి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక పోవడంతో వచ్చిన ఏ చిన్న అవకాశమైనా వినియోగించుకుంటూ ముందుకెలుతోంది. కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

English summary
Check out, Charmi posted new video in FB.
Please Wait while comments are loading...