»   » జనవరి 24న విడుదలకు సిద్ధమవుతున్న ‘లవ్ యూ బంగారమ్’

జనవరి 24న విడుదలకు సిద్ధమవుతున్న ‘లవ్ యూ బంగారమ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హ్యాపీడేస్ ఫేం రాహుల్, రాజీవ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'లవ్ యు బంగారమ్'. శ్రావ్య కథానాయిక. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్, మారుతి టాకీస్ బానర్లపై వల్లభ, మారుతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గోవి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా విడుదలైన చిత్రం వర్కింగ్ స్టిల్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో హీరో రాహుల్ ఇంట్లో కండోమ్స్ అయిపోయాయి అని ప్లకార్డు ప్రదర్శించం, జబర్దస్త్ టీవీ షోద్వారా ఫేమస్ అయిన శకలక శంకర్ ఈ ఫోటోల్లో కొజ్జా అవతారంలో కనిపించడం ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. చక్రి సోదరుడు మహిత్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన అభిస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

జనవరి 24న విడుదదల

జనవరి 24న విడుదదల


ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారని అభినందించడం విశేషం. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం....అని నిర్మాతలు తెలిపారు.

మారుతి నమ్మకాన్ని నిలబెడతా

మారుతి నమ్మకాన్ని నిలబెడతా


దర్శకుడు మాట్లాడుతూ....‘స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన నేను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. మారుతిగారు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన సింగిల్ సిట్టింగులో కథ ఓకే చేసారు. మారుతిగారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అన్నారు.

అందరికీ నచ్చుతుంది

అందరికీ నచ్చుతుంది


సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఎంటర్టెన్ చేస్తుందని దర్శకుడు తెలిపారు.

మారుతికి మరో హిట్

మారుతికి మరో హిట్


ఈ చిత్రంతో మారుతిగారు మరో హిట్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు దర్శకుడు.

శ్రావ్య గ్లామర్ కేక..

శ్రావ్య గ్లామర్ కేక..


‘హ్యాపీడేస్' రాహుల్, రాజీవ్, శ్రావ్య పాత్రల్లో ఒదిగి పోయారు. రాహుల్, రాజీవ్ నట, శ్రావ్య గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు గోవి తెలిపారు.

రాజీవ్ ఎవరంటే..?

రాజీవ్ ఎవరంటే..?


ఈ చిత్రం ద్వారా రాజీవ్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. రాజీవ్ ఎవరో కాదు... ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు.

శకలక శంకర్

శకలక శంకర్


జబర్దస్త్ కామోడీ టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయిన శకలక శంకర్ ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకోనున్నాడు.

యూత్‌ను ఆకట్టుకునేలా..

యూత్‌ను ఆకట్టుకునేలా..


లవ్ యు బంగారమ్' మూవీ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.

రొమాంటిక్ చిత్రాలు

రొమాంటిక్ చిత్రాలు


తాజాగా విడుదలైన ఆ చిత్రం వాల్ పోస్టర్స్‌ హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ చిత్రాలు యూత్ కిర్రెక్కించేలా ఉన్నాయి.

క్రియేటివ్‌ కమర్షియల్‌ మరియు మారుతి

క్రియేటివ్‌ కమర్షియల్‌ మరియు మారుతి


క్రియేటివ్‌ కమర్షియల్‌ మరియు మారుతి టాకీస్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కె.వల్లభ, మారుతి నిర్మాతలు. కె.ఎస్‌.రామారావు సమర్పకులు. పముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ సంగీతం అందించారు.

15 నిమిషాల్లో కథ ఫైనల్

15 నిమిషాల్లో కథ ఫైనల్


దర్శకుడు గోవి మాట్లాడుతూ.. 'నా మిత్రుడి ద్వారా మారుతిగారిని కలిసి కథ చెప్పాను. 15 నిమిషాల్లో ఫైనల్‌ చేశారు. నా మీద నమ్మకంతో ఏ రోజు సెట్‌లో అడుగుపెట్టలేదు ఆయన. ఎడిటింగ్‌ రూమ్‌లోనే సినిమా చూసి హ్యాపీ ఫీలయ్యారు. మొదటి చిత్రం కె.ఎస్‌.రామారావుగారి బ్యానర్‌లో చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

మారుతి ఏమంటున్నారంటే

మారుతి ఏమంటున్నారంటే


మారుతి మాట్లాడుతూ.. 'మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని కె.ఎస్‌.రామారావుగారు నన్ను అప్రోచ్‌ కావడంతో ఈ సినిమా ప్రారంభించాం. కష్టపడే వారికి నేను అవకాశాలు కల్పిస్తాను. గోవికి ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్‌గా వినియోగించుకున్నాడు. ప్రతి ఆర్టిస్ట్‌ నుండి బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ తీసుకున్నాడు. విజువల్స్‌ చూసి షాకయ్యాను. ఇచ్చిన బడ్జెట్‌ కంటే బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాడు.

పెద్ద సినిమాలను కంగారు పెట్టించాలి

పెద్ద సినిమాలను కంగారు పెట్టించాలి


మూడు దశాబ్దాల తరువాత యూత్‌ఫుల్‌ ఫిలిం తీయడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా ఈ తరహా చిత్రాలు చేయాలనుంది. యూత్‌ అంతా కలిసి పెద్ద చిత్రాలను కంగారు పెట్టించాలి అన్నారు నిర్మాత.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం: మహిత్, బ్యాగ్రౌండ్ స్కోర్ : జె.బి, ఎడిటింగ్: ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ : అరుణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎస్.కె.ఎస్, జి.శ్రీనివాసరావు, లైన్ ప్రొడ్యూసర్స్ : అడ్డాల శ్రీనివాసరావు, పీఆర్ఓ : ఏలూరు శ్రీను, నిర్మాతలు : వల్లభ, మారుతి, కథ-మాటలు-స్ర్రీన్ ప్లే-దర్శకత్వం: గోవి.

English summary
'Love You Bangaram' on Jan 24. KS Rama Rao, head of CC has joined hands with Maruthi Talkies to jointly produce ‘Love You Bangaram’, a youthful comedy introducing Surender Reddy’s disciple Govi as the director, child artist Shravya as the heroine and Chakri’s brother Mahith Narayan as the music director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu