»   » ఏంటీ..ఆ బూతు కథ అనుష్క తోనా..?

ఏంటీ..ఆ బూతు కథ అనుష్క తోనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''ఈ కథని నేను మూడేళ్ల కిందటే సిద్ధం చేశాను. అనుష్క హీరోగా తీయాలనుకొన్నా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మారుతిగారితో సినిమా అనుకొన్నప్పుడు ఆయనకి నాలుగైదు కథలు వినిపించాను. వాటిలో ఇది బాగా నచ్చింది. ట్రెండ్‌కి అనుగుణంగా ఉంది కాబట్టి... దీన్నే తీద్దామన్నారు. ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది'' అని చెప్పుకొచ్చారు గోవర్దన్ రెడ్డి. ఆయన దర్శకుడుగా పరిచయం అవుతూ...'లవ్‌ యు బంగారమ్‌'చిత్రం వచ్చింది.

మొన్న శుక్రవారం విడుదలైన 'లవ్‌ యు బంగారమ్‌'చిత్రం పక్కా బూతు చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ గా చేద్దామనుకున్నాను అని దర్శకుడు స్టేట్ మెంట్ ఇవ్వటంతో అంతా షాక్ అయ్యారు. అలాగే అప్పట్లో హీరోగా నాగార్జునని అనుకుని ఎప్రోచ్ అయ్యాడని అక్కడ రిజెక్టు అయ్యిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ కాంబినేషన్ లో ఇంత బూతు సినిమా ఊహించలేం అంటున్నారు సినివాసులు.

కథ ఏమిటంటే...మొబైల్ కంపెనీలో పనిచేసే ఆకాష్(రాహుల్), మీనాక్షి(శ్రావ్య)తో ప్రేమలో పడతాడు. అయితే వాళ్ళ ప్రేమని పెద్దలు మధ్య పొలిటకల్ విభేదాలు ఉండటంతో ఒప్పుకోరు. దాంతో ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొంతకాలానికి ఆమె జాబ్ లో జాయిన్ అవుతుంది. అప్పటినుంచి వారి జీవితం మలుపు తిరుగుతుంది. వారి జీవితంలోకి మదన్ (రాజీవ్) రావటంతో సమస్యలు వస్తాయి. ఇన్ సెక్యూర్ ఫీలింగ్ తో ఉండే రాహుల్ కి ఆమెపై అనుమానం మొదలవుతుంది. మీనాక్షి కూడా దానికి తగినట్లే బిహేవ్ చేస్తుంది. దాంతో ఆకాష్ లో అనుమానం పెరిగి పెద్దదై తీవ్రరూపం దాలుస్తుంది. ఇంతకీ మదన్ ఎవరు..ఆమె కూడా అలా అనుమానం కలిగేలా ఎందుకు బిహేవ్ చేసింది...చివరకు ఏమైందనే విషయం తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

సినిమాలో చెప్పుకోవటానికి కానీ, చూడటానికి పెద్ద ఏమీ లేదు. మారుతి బ్రాండ్ నేమ్ తో ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రంలో దర్శకుడు కథ,కథనాలపై కన్నా సాధ్యమైనంత బూతుని డైలాగుల్లో చొప్పించటానికే ఎక్కువ శ్రమపడ్డారు. స్క్రీన్ ప్లే చాలా బోర్ గా తయారు చేసుకోవటంతో ఎక్కడా ఆసక్తి లేకుండా తెరపై సీన్స్ నడుస్తూంటాయి. అలాగే సీన్స్ లో డెప్త్ కానీ, చెప్పుకోతగ్గ విషయం గానీ లేకుండా సోసోగా నడిచిపోతూంటాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ కోసం మిగిలిన స్క్రీన్ టైం మొత్తం బలిచేసేసాడు దర్శకుడు. అలాగని ఎంటర్టైన్మెంట్ మీద అయినా ఆధారపడ్డాడా అంటే అదీ లేదు. ఉన్న కాస్తా బూతు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

ఇక ''తీసే కథ ఏదైనా సరే... ప్రస్తుత పోకడలను ప్రతిబింబించేదిగా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులకు చేరువవుతుందని నమ్ముతాను. ప్రతి ఒక్కరిలోనూ ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తుంటుంది. ఆ విషయాన్నే కొత్తగా పెళ్లి చేసుకొన్న ఓ జంట నేపథ్యంలో తెరపై చూపించా'' అన్నారు దర్శకుడు గోవర్ధన్‌ రెడ్డి. 'లవ్‌ యు బంగారమ్‌'లో రాహుల్‌, శ్రావ్య జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు మాట్లాడుతూ తదుపరి మారుతి నిర్మాణంలోనే మరో చిత్రం చేయబోతున్నా అని తెలిపారు. అదెలాగుంటుందో అంటున్నారు.

English summary
Rahul,Sravya starrer ‘Love You Bangaram’ hit the screens friday. Director Govardhan Reddy said he showed the insecurity feeling among newly wedded couples. He said he planned to take the film with Anushka but was shelved three years back.He said he narrated three stories to Maruthi and he liked this one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu