లో లెవల్ బడ్జెట్...హై లెవల్ అవార్డ్స్

By Bojja Kumar

భారీ హంగులు, కోట్ల రూపాయలతో సెట్లు, భారీ తారాగనం, భారీ బడ్జెట్ తో సినిమా తీశారు. కానీ సినిమా ఫెయిల్యూర్.... పెద్దగా హంగులు లేవు, కోట్ల రూపాయలతో సెట్టింగులు అంతకన్నా లేవు. బాగా పేరు మోసిన తారలు లేకపోయినా పర్‌ఫెక్షన్ చూపించే యాక్టర్స్ లో బడ్జెట్లో సినిమా పూర్తి చేశారు. సినిమా సూపర్ హిట్టు మంచి కలెక్షన్లు, ప్రశంసలు, అవార్డులు.

తెలుగు సినిమా రంగానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డుల్లో 2010 సంవత్సరానికి గాను పలు చిన్న సినిమాలు సత్తా చాటాయి. ఒక మంచి సినిమా తీసి, ప్రేక్షకాదరణ, విమర్శకుల ప్రశంసలు పొందాలంటే భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగులు అవసరం లేదని నిరూపించాయి.

ఉత్తమ సినిమాగా వేదం, ఉత్తమ దర్శకుడిగా సునీల్ కుమారెడ్డి(గంగపుత్రులు), ఉత్తమ జనాదరణ పొందిన చిత్రంగా మర్యాద రామన్న, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అందరి బంధువయ, ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా నందినీరెడ్డి(అలా మెదలైంది) ఎంపికయ్యాయి. ఈ సినిమాలన్నీ లో బడ్జెట్లో, సామాజిక బాధ్యతతో, జనాదరణ పొందిన కథాంశాలతో కూడి చిత్రాలే కావడం విశేషం. భారీ బడ్జెట్తో వచ్చిన సింహా సినిమాకుః రెండు అవార్డులు దక్కినా...అవి బాలయ్య నటనకు, చ్ర్రకి సంగీతానికే పరిమితం అయ్యాయి.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో..... ప్రేక్షకాదరణతో పాటు అవార్డులను సాధించి పై సినిమాను ఇకపై మన దర్శకులు ఆదర్శంగా తీసుకుంటారని, కష్టాల కడలిలో ఈదుతున్న టాలీవుడ్ ను ఒడ్డుకు చేరుస్తారని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X