»   » ఉదయ్ కిరణ్ ఇష్యూ: ఆ వెబ్‌సైట్లే కారణమన్న చంద్రబోస్

ఉదయ్ కిరణ్ ఇష్యూ: ఆ వెబ్‌సైట్లే కారణమన్న చంద్రబోస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Lyricist Chandrabose
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య నేపథ్యంలో సినీ పరిశ్రమల్లో గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ నటులు వ్యవహారం చర్చనీయాంశం అయింది. తాజాగా సినీ గేయరచయిత చంద్రబోస్ మీడియాతో నటుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ....సినీ నటుల ఆత్మహత్యలకు కొన్ని వెబ్ సైట్లే కారణమవుతున్నాయని అన్నారు.

కొన్ని వెబ్ సైట్లు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్నాయని, ఆధారాలు లేకుండా గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని, వాటి వల్ల సినీ నటులు ఆవేదనకు గురవుతున్నారని అభిప్రాయ పడ్డారు. అయితే వెబ్ సైట్లలో వచ్చే గాసిప్స్ వల్ల అలాంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చాయా అంటే సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు చంద్రబోస్.

ఇక ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాల విషయానికొస్తే..... అవకాశాలు లేక పోవడం వల్లనే ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగి పోయారని తెలుస్తోంది. కొంత కాలం చెన్నై వెళ్లి అక్కడ తమిళ సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేసాడని, అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని, కొందరైతే నువ్వెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారని, దీంతో ఉదయ్ కిరణ్ తీవ్రంగా బాధపడేవాడని తెలుస్తోంది.

దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన్ను బంధువులు, స్నేహితులు ఎవరూ కలవక పోవడం, కృంగి పోతన్న తనను ఓదార్చే వారు లేక పోవడం లాంటి పరిస్థితులు కూడా ఆయన్ను ఆత్మహత్య వైపు మళ్లించాయని తెలుస్తోంది. అవకాశాలు లేక మానసికంగా కృంగి పోతున్న తనకు అయిన వారి ఓదార్పు లేక పోవడం, స్నేహితులు సన్నిహితులు కూడా ఆయనకు దూరంగా ఉండటం.........ఇలాంటి పరిణామాలెన్నో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.

English summary
Uday kiran suicide issue: Lyricist Chandrabose blames some websites. Chandrabose says, Some website has been delivering baseless celebrity gossips.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu