twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ల తీరు నచ్చలేదు... అరవింద సమేత షూటింగ్ నుండి వెళ్లిపోయా : పెంచల్ దాస్

    |

    'అరవింద సమేత' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరి దృష్టిని ఆకర్షించారు లిరిసిస్ట్ పెంచల్ దాస్. 'కట్టెలే చుట్టాలు...కాడు మన తల్లిదండ్రి... అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట... కాలవ గట్టున నీ కాళ్లు కాలంగా కాకిశోకము పోతివే'' అంటూ ఆయన పాడిన పాట అందరూ ఎమోషనల్‌గా కనెక్టయ్యారు. తండ్రి పోయిన బాధలో ఉన్న జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరింత ఎమోషనల్ అయ్యారు. పెంచల్ దాస్ దాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న 'అరవింద సమేత' డైలాగుల విషయంలో, స్లాంగ్ విషయంలో అతడి సహాయం తీసుకున్నారట త్రివిక్రమ్.

    Recommended Video

    Aravinda Sametha Movie Had A Change

    తాజాగా పెంచల్ దాస్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనకు ఈ సినిమా హడావుడి అంటే నచ్చదని, కేవలం త్రివిక్రమ్ మీద ఇష్టంతోనే పని చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.

    ఆ సమయంలో త్రివిక్రమ్ నుండి ఫోన్

    ఆ సమయంలో త్రివిక్రమ్ నుండి ఫోన్

    ఓసారి నేను ఆరో తరగతికి క్లాస్ చెబుతుండగా మధ్యాహ్నం పూట ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. అటు వైపు నుండి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పారు. మీకు నాకు తెలుసు సార్.. మీ సినిమాలు చూస్తుంటాను, మీ మాటలంటే ఇష్టం అని చెప్పాను.... అని పెంచల్ దాస్ గుర్తు చేసుకున్నారు.

    రుడాలి సాంప్రదాయంలో పాట కాలన్నారు

    రుడాలి సాంప్రదాయంలో పాట కాలన్నారు

    ఆ తర్వాత మాటల్లో మా గురువుగారు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రస్తావన వచ్చింది. ఆయనకు త్రివిక్రమ్ సార్ కూడా అభిమాని. నేను ఇలా జూ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాను. నాకొక పాట కావాలి రుడాలి సాంప్రదాయంలో అన్నారు. రుడాలి సాంప్రదాయం అంటే బెంగాళీలో శవాల దగ్గర డబ్బులు తీసుకుని ఏడ్చి పాడేవారు ఉంటారు... అని పెంచల్ దాస్ తెలిపారు.

     చివరకు ఆ పాట నచ్చింది

    చివరకు ఆ పాట నచ్చింది

    మా పెద్దోళ్లు కూడా చావు దగ్గర సంకీర్తనలు చేస్తుంటారు. ఆయన పాట రాయమని చెబితే మూడు వెర్షన్లు రాశాను. కానీ ఆయనకు అది నచ్చలేదు. మూడోది కట్టెలే చుట్టాలు అనే పెద్ద పాట రాస్తే బావుంది అన్నారు. దాన్ని కుదించి శాస్త్రిగారి చేత కొంత రాయించారని పెంచల్ దాస్ తెలిపారు.

     వీళ్లంతా గోదారోళ్లు కాబట్టి స్లాంగ్ తెలియదు

    వీళ్లంతా గోదారోళ్లు కాబట్టి స్లాంగ్ తెలియదు

    రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమా కావడంతో డైలాగులు రాయడంలో తనకు సహాయంగా ఉండాలని కోరారు. వీళ్లంతా గోదావరి జిల్లాల వారు కావడంతో వారికి స్లాంగ్ తెలియదు. అందుకనే స్లాంగ్ విషయంలో నా సహాయం తీసుకున్నారు.... అని పెంచల్ దాస్ తెలిపారు.

    సినిమాలు, హీరోలు ఆసక్తి లేదు, త్రివిక్రమ్ కోసమే...

    సినిమాలు, హీరోలు ఆసక్తి లేదు, త్రివిక్రమ్ కోసమే...

    ఈ సినిమాలు, హీరోలు అంటే నాకు అంత పెద్దగా ఆసక్తి ఉండదు. మామూలుగా ఉంటే చాలు అనుకుంటాను. ఇంకా రాయాల్సింది ఉంది. మా బ్రతుకులపై కొన్ని కథలు రాస్తున్నాను. ఆ పని మీద ఉండగా త్రివిక్రమ్ నుండి ఫోన్ వచ్చింది. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మరింత ప్రాణంగా మారిపోయాడు. ఆయన మనిషిని అంతగా ప్రేమిస్తారు. ఆయన నాకు నచ్చాడు కాబట్టే ఇన్ని రోజులు ట్రావెల్ చేశాను.... పెంచల్ దాస్ వెల్లడించారు.

    వాళ్ల తీరు నచ్చలేదు, వెళ్లిపోయాను

    వాళ్ల తీరు నచ్చలేదు, వెళ్లిపోయాను

    ఓసారి వీరితో ఇబ్బంది అనిపించింది. ఏప్రిల్ మాసంలో ఈ సంఘటన జరిగింది. ఎందుకనో ఈ షూటింగ్ హడావుడి నచ్చలేదు. దీంతో పాటు ఆరోగ్యం పాడవటంతో వెళ్లిపోయాను. మళ్లీ పిలిచారు. త్రివిక్రమ్ సార్ మహారచయిత. మహా జ్ఞాని. కానీ ఏదైనా డైలాగ్ పెట్టాలనుకున్నపుడు ఇది పెడితే బావుంటుందా? అని అడుగుతారు. అది గొప్ప విషయం. ఆయనకు స్లాంగ్ ఒక్కటే తెలియదు, అన్నీ తెలుసు అని పెంచల్ దాస్ అన్నారు.

     త్రివిక్రమ్‌లో ఆ గర్వం కనిపించదు

    త్రివిక్రమ్‌లో ఆ గర్వం కనిపించదు

    త్రివిక్రమ్ నాతో చాలా చనువుగా ఉంటారు. నేను పెద్ద దర్శకుడిని, పెద్ద రచయితను అనే భావం అతడి మనసులో ఉండదు. పక్కన కూర్చోపెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు ఆరోగ్యం బాగోలేకున్నా మిమ్మల్ని తీసుకొచ్చాము అనేవారు. అంతలా చూసుకునే వారు ఇంట్లో వారి మాదిరిగా అనిపిస్తారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు చేశాను. సినిమా డబ్బింగ్ కోసం పండగలు పబ్బాలు ఇల్లు అన్నీ వదిలేసి పరుగెత్తేశాను... అని పెంచల్ దాస్ అన్నారు.

    English summary
    Lyricist Penchal Das about Director Trivikram Srinivas and Aravinda Sametha movie. Penchal Das is an Indian film Singer and Lyricist, who has worked predominantly in Telugu movie industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X